Interview with aamir khan

aamir khan satyamev jayate, aamir khan, satyamev jayate, satyamev, satyameva, jayate, aamir, khan, television, show, TV, TV show, television show, aamir khan,Aamir, Khan;, Satyamev, Jayate;, Dhoom, 3;, Rajkumar, Hirani

aamir khan satyamev jayate, aamir khan, satyamev jayate, satyamev, satyameva, jayate, aamir, khan, television, show, TV, TV show, television show, aamir khan,Aamir, Khan;, Satyamev, Jayate;, Dhoom, 3;, Rajkumar, Hirani

Interview with Aamir Khan.gif

Posted: 05/28/2012 01:52 PM IST
Interview with aamir khan

Interview_with_Aamir_Khan

Aamir_Khan"సత్యమేవ జయతే...'' ఎప్పుడో మండూక ఉపనిషత్తులో చెప్పిన మాట! కరెన్సీ నోట్ల మీద, కోర్టు గోడల మీద, మూడు సింహాల చిహ్నంలో కనిపించే మాట! ఇది అందరూ విన్నదే! అందరూ చూసిందే! ఇదే మాటను... ఇప్పుడు ఆయన వచ్చి చెబుతున్నారు! చెప్పడమే కాదు.. దేశమంతటా మార్మోగేలా నినదిస్తున్నారు. ఏం... ఆయన చెబితే వినాలా? ఎందరు చెప్పినా వినని వాళ్లు ఆయన చెప్పినంత మాత్రాన వింటారా? వింటారు! కొందరైనా వింటారు! కొందరైనా మారతారు. ఎందుకంటే, ఉపనిషత్తులనాటి మాటను ఇప్పుడు కొత్తగా చెబుతున్నది ఎవరో కాదు.. ఖాన్.. అమీర్‌ఖాన్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో ఢిఫరెంట్. ఈయన గురించి.. ఈయన చేసిన పనులు గురించి కొన్ని విషయాలు మీకోసం..

జో జీతా వహీ సికిందర్! ఔను... గెలిచిన వాడే మొనగాడు! అమీర్ ఖాన్ గెలిచాడు. వెండి తెరపై కథానాయకుడిగా గెలిచాడు. దర్శకునిగా, నిర్మాతగా కూడా గెలిచాడు. ఇప్పుడు... ఒక మనిషిగా కోట్లాది హృదయాలను గెలుస్తున్నాడు. బాలీవుడ్‌లో ఎంతో మంది నటీనటులున్నారు. వాళ్లలో చాలామంది వెండితెరపై మాత్రమే మెరుస్తుంటారు. అక్కడెక్కడో, దూరంగా ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తారు. కానీ... అమీర్ ఖాన్ మన పక్కనే కనిపిస్తాడు. భూమ్మీదే మెరుస్తాడు. తారే జమీన్ పర్ అంటూ నేల మీదికి నక్షత్రాలను దించుతాడు. మన పక్కింటి కుర్రాడిలా ఆప్యాయంగా కనిపిస్తాడు.

అందుకే.. అమీర్ ఖాన్ ప్రత్యేకం. అందరికంటే ప్రత్యేకం. అందరూ నడుస్తారు. నువ్వూ నడుస్తావు. అందరూ ఎక్కడికి వెళతారో, నువ్వూ అక్కడికే వెళతావు! నువ్వో గుంపులో గోవిందయ్యవు! నలుగురిలో నారాయణవు! అమీర్ ఖాన్ స్టార్స్‌లో స్టార్‌లా కలిసిపోలేదు. నేను, నా సినిమాలు, నాకొచ్చే వందల కోట్ల రూపాయల పారితోషికం!... అంటూ వాటికే పరిమితం కాలేదు. కొంచెం పక్కకు జరిగాడు. ప్రత్యేకంగా మెరుస్తున్నాడు. ఇప్పుడు ఏ మ్యాగజైన్ తిప్పినా, ఛానల్‌లో చూసినా అమీర్ పేరు గొప్పగా వినిపిస్తోంది! మరి ఆయనలో ఏదో ఉన్నట్లే కదా!

చాలానే ఉంది.అమీర్ ఖాన్‌ను అంతగా పొగడాలా? ఏమిటంట ఆయన గొప్ప? అని బుగ్గలు నొక్కుకునే వాళ్లూ ఉండొచ్చు. ప్రతి మనిషి నుంచిAamir_Khan1 ఎంతో కొంత మంచిని నేర్చుకోవచ్చు అనేది నిజమైతే... అమీర్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సినిమాల నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చనేది నిజమైతే... అమీర్ సినిమాల నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు. అమీర్ వ్యక్తిత్వం, ఆయన తీసిన కొన్ని సినిమాలు... వ్యక్తిత్వ వికాస పాఠాలకు ప్రత్యేక పాఠ్యాంశాలు అవుతాయి. క్రికెట్‌ను పుట్టించిన బ్రిటిష్ వాళ్లను అదే క్రికెట్‌తో దెబ్బకొట్టే 'లగాన్' గుర్తుందా? అప్పటిదాకా హీరోగా మాత్రమే ఉన్న అమీర్ ప్రత్యేక ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది. డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ 'లగాన్' స్క్రిప్టు పట్టుకుని షారూఖ్ ఖాన్ వద్దకు వెళ్లారు. "దీనికి నేను కాదు. అమీరే పర్‌ఫెక్ట్'' అని అశుతోష్‌ను తిప్పి పంపాడు. కథ మొత్తం విన్నాక... అమీర్ ఓకే చెప్పాడు. ఇక... డైరెక్టర్ అశుతోష్ నిర్మాతల కోసం వేట ప్రారంభించాడు. "అబ్బే... ఇదేం కథ!'' అంటూ పెదవి విరిచారు

కొందరు."ఈ కథతో సినిమా తీస్తే, అంతసేపు థియేటర్‌లలో జనం కూర్చోలేరు..'' అన్నారు ఇంకొందరు. "వామ్మో... ఇన్ని క్యారెక్టర్లు, ఇంత భారీ వ్యయం భరించలేం' అని చేతులెత్తేశారు నిర్మాతలు. ఇక, ఈ కథను తెరకెక్కించడం అసాధ్యం అని అశుతోష్ ఓ నిర్ణయానికి వచ్చాడు. అప్పుడే, అమీర్‌లోని నిర్మాత బయటికొచ్చాడు. "ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ సినిమా నేను తీస్తాను'' అంటూ ఆ సినిమాను తనే తీశాడు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వెలువడిన మొదటి సినిమా అది. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరిగింది. అదే సమయంలో స్థానికులతో అమీర్‌కు బంధం ఏర్పడింది. లగాన్‌లో క్రికెట్ మ్యాచ్ ప్రేక్షకులుగా స్థానికులే కనిపిస్తారు.షూటింగ్ గ్యాప్‌లో అమీర్ వాళ్లలో ఒకరిగా కలిసిపోయేవారు. వారు చెప్పింది వింటూ, తనూ కబుర్లు చెబుతూ... మధ్య మధ్యలో పాటలు పాడుతూ అలసటను మరిచిపోయేలా చేశారు. ఈ ప్రపంచంలో అందరికంటే ముందు ఈ సినిమాను మీకే చూపిస్తా అంటూ షూటింగ్ చివరి రోజున ప్రామిస్ చేశాడు. ఆ మాట ప్రకారం మళ్లీ వచ్చాడు. అందరికంటే ముందు వారికే సినిమా చూపించి శభాష్ అనిపించుకున్నాడు. దటీజ్ అమీర్!

రైతుల ఆత్మహత్యలు- మీడియా- రాజకీయాల మీద వచ్చిన 'పిప్లీలైవ్'ను కూడా ఎంతో కష్టపడి తీశాడు అమీర్. ఈ స్క్రిప్టును ఓ పాత్రికేయురాలు రాసింది. ఆమె చాలాసార్లు అమీర్‌కు ఫోన్లు చేసినా మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు. ఒక రోజు స్క్రిప్టు పట్టుకుని రమ్మన్నాడు అమీర్. కథ నచ్చింది. తనే నిర్మాతగా ఆదివాసీ నటులతో సినిమా తీసి అందరి మెప్పునూ పొందాడు.

దేశాన్వేషణ...

Aamir_Khan2'ఒక పని చేయక తప్పదా? అయితే... కష్టంగానో, ఇష్టంగానో చెయ్'... ఇది కొందరి ఫిలాసఫీ. ఇందులో రాజీ ధోరణి ఉంది.
'ఏదో ఒక పని కాదు! ఇంకెవరో చెప్పారని కాదు! నీకు ఇష్టమైన పనే చెయ్!' ఇది సక్సెస్ గ్యారెంటీ స్కీమ్! ఆత్మ సంతృప్తి బోనస్! ఇదే... '3 ఇడియట్స్' థీమ్! ఇందులోని సారాంశం కూడా ఒక పాఠమే! కుర్రాళ్లకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు... మొత్తం మన వ్యవస్థకు నేర్పే గుణపాఠమే! అమీర్ సినిమాల్లోనే ఇది ప్రత్యేకం. అంతేకాదు... అమీర్‌ఖాన్‌కూ ప్రత్యేకమే! 'రెమ్యునరేషన్ తీసుకున్నామా, సినిమాలో నటించామా'....అన్నది కాదు. అంతటితో అమీర్ కమిట్‌మెంట్ ఆగిపోదు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన దేశం నలుమూలలా కలియ తిరిగాడు. ఇది మంచి సినిమా బతకడం కోసం అమీర్ చేసిన 'దేశాన్వేషణ'. ఓ వృద్ధుడి వేషంలో వారణాసి వీధుల్లో ఆకట్టుకున్నాడు. పొడవాటి జులపాలు, ఒంటిపై టాటూలతో కోల్‌కతాకు వెళ్లాడు.అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌లో పిల్లలతో రోజంతా గడిపాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జైపూర్ దాకా వెళ్లొచ్చాడు. ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు ఏ కార్పొరేట్ ఆస్పత్రికో వెళ్లలేదు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ డాక్టర్ ఇంటి తలుపు తట్టాడు. మారు వేషాలతో తిరుగుతూ, జనంలో కలిసిపోయి తనను గుర్తించిన వారికి బహుమతులు అందించి, ఆశ్చర్యపరిచాడు. సినిమా ప్రమోషన్ కోసం అందరు హీరోల్లా ఏ విమానమో ఎక్కి, మల్టీప్లెక్స్‌ల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టి అట్నుంచి అటే వెళ్లిపోయి ఉంటే... ఇప్పుడు 'సత్యమేవ జయతే' అనే టీవీ ప్రోగ్రాం ఉండేదే కాదు!

డిస్కవరింగ్ ది ఇండియన్స్...

Aamir_Khan3'3 ఇడియట్స్' కోసం అమీర్ చేసిన ప్రచార యాత్ర ఆయనకు అసలైన భారతావనిని చూపించింది. విలాసవంతమైన కారు అద్దంలో నుంచి చూస్తే కనిపించే దేశం వేరు... కాలు కిందపెట్టి జనంతో కలిసి నడిచినప్పుడు కనిపించే భారతం వేరు! అమీర్ రెండో కోవకు చెందిన భారతాన్ని చాలా దగ్గరగా చూశాడు. ఈ సినిమా ప్రచారం కోసం వయసుమీరిన పెద్దమనిషి వేషంలో ఆటోలో ప్రయాణించాడు. ఆ సమయంలోనే రామ్‌లఖన్ అనే ఆటోవాలా పరిచయం అయ్యాడు. ఈ మధ్యనే ఆ ఆటోవాల కొడుక్కు పెళ్లయింది. పెళ్లికి వస్తానని మాట ఇచ్చిన అమీర్ దాన్ని నిలబెట్టుకున్నారు. వారణాసిలో జరిగిన వివాహానికి వెళ్లి.. దంపతులను ఆశీర్వదించాడు.3 ఇడియట్ ప్రచార అనుభవంతోనే.. 'ఏదో చేయాలి!' అని అప్పుడే అనుకున్నాడు. అమితాబ్ నుంచి రాఖీ సావంత్ దాకా టీవీల్లో 'షో' చేసిన వారే. కాకపోతే... అవన్నీ డబ్బులు, బహుమానాలు, గెంతులు, పాటలు, ప్రశ్నలకు సంబంధించినవే! '

`m1nస్టార్' నెట్‌వర్క్ ప్రతినిధి ఉదయ్ శంకర్ ఒకరోజు అమీర్ వద్దకు వచ్చాడు. 'మా ఛానల్‌లో గేమ్‌షో చేద్దామా సార్' అన్నాడు! 'చేయను' అని అమీర్ చెప్పేశాడు. 'ఇంకేదైనా సరే... మీకు ఇష్టమైనదే చేయండి!' అని ఉదయ్ అడిగాడు. 'ఇంకేదైనా' అనే ప్రశ్నకు అమీర్ చెప్పిన సమాధానమే 'సత్యమేవ జయతే!' 13 వారాలు... 13 సామాజిక సమస్యలు... ఒక్కో ఎపిసోడ్ 90 నిమిషాలు! ఇదీ ఈ కార్యక్రమ సారాంశం! ఒక్కో ఎపిసోడ్‌కు అమీర్ ఖాన్ తీసుకుంటున్న సొమ్ము అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయలు."నా సంపాదన ఏడాదికి రూ.100 కోట్ల నుంచి 125 కోట్ల మధ్య ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఏడాదిగా మిగిలిన అన్ని పనులు పక్కనపెట్టాను. సామాజిక అంశాల కోసం వందకోట్లు వదులుకున్న వారిని చూపించండి!'' అంటూ విమర్శకులకు అమీర్ సూటిగా సమాధానమిచ్చాడు. అంటే అమీర్ ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉందన్నట్లేగా! మనిషి ఆలోచనా ధోరణి మారితే చాలు! చాలా సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ధోరణి మార్చేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నమిది.

Aamir_Khan4ఎంతోకొంత మార్పు వచ్చినా సంతోషమే కదా'' అని అమీర్ అన్నాడు. 'మనం మారాలి' అని మనసును తాకేలా చెబుతున్నాడు. ఈ కార్యక్రమ రూపకల్పనే కాదు... ప్రసారంలోనూ ప్రత్యేకత ఉంది. ఒకే సమయంలో... అనేక భాషల్లో, అనేక ఛానళ్లలో ప్రసారం కావడం. అంతేకాదు... దూరదర్శన్‌లోనూ వస్తోంది. కేబుల్ టీవీ లేని ఊళ్లకు, ఉన్నా ఆ ఖర్చు భరించలేని ఇళ్లకు కూడా తన సందేశాన్ని వినిపించడమే అమీర్ ఉద్దేశం. 'సత్యమేవ జయతే' తొలి ఎపిసోడ్‌ను 9 కోట్ల మంది ప్రజలు తిలకించడం విశేషం.అమీర్‌కు ఆకలి తెలియదు. పేదరికం తెలియదు. సినిమాలతో సంబంధం ఉన్న సంపన్నుల కుటుంబంలో పుట్టాడు. చిన్నతనంలోనే మేకప్ వేసుకున్నాడు. రంగుల ప్రపంచంలో పెరిగాడు. కానీ... మనిషికీ, సమాజానికీ మధ్య ఉండాల్సిన బంధాన్ని మాత్రం సజీవంగా ఉంచుకున్నాడు. అమీర్ నర్మదా బచావో ఆందోళన్‌కు మద్దతు తెలిపాడు. విద్యుత్‌ను పొదుపు చేయమని చెప్పే ఎర్త్ అవర్‌లో పాల్గొన్నాడు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారేతో గొంతు కలిపాడు. 'అతిథి దేవోభవ' అంటూ విదేశీ పర్యాటకుల పట్ల అమర్యాదగా వ్యవహరించే వారి కళ్లు తెరిపించాడు. 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచారంలో భాగస్వామి అయ్యాడు. ఎన్నికల ముందు 'మంచి వారినే ఎన్నుకోండి!' అని ప్రచారం చేశా డు. పాఠశాలల్లోని మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం ఉద్యమించాడు. పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య తీవ్రతను ఎత్తి చూపాడు. ఇవేవీ అమీర్ డబ్బుల కోసం చేసినవి కావు. అందుకే... అందరూ వేరు! అమీర్ వేరు! అందుకే అమీర్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ తో పాటు ఢిఫరెంట్.

సత్యమేవ 'జయ'తే...

-  భ్రూణహత్యలపై ప్రసారమైన తొలి ఎపిసోడ్‌ను టీవీ ముందు కూర్చుని 9 కోట్ల మంది చూస్తే 'యూట్యూబ్'లో మొదటి రోజే లక్షన్నర మంది చూశారు.
-  ఈ కార్యక్రమం మధ్యలో ప్రసారమయ్యే 10 సెకన్ల యాడ్ విలువ రూ.10 లక్షలు. ఐపీఎల్ యాడ్ రేట్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
-  భ్రూణహత్య కేసుల్లో విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అంగీకరించడం విశేషం.ఒకే ఒక్కడు... అమీర్!
- ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే మరొకటి! ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడు.
-  ఫిల్మ్‌ఫేర్ వంటి పత్రికలు, కమర్షియల్ సంస్థలు ఇచ్చే అవార్డులు తీసుకోడు. ఈ అవార్డులకు విశ్వసనీయత లేదన్నది అమీర్ Aamir_Khan7అభిప్రాయం.
-  ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అమీర్ మైనపు బొమ్మ పెడతామంటే 'వద్దు' అంటూ సున్నితంగా తిరస్కరించాడు.మార్పొస్తుందన్న ఆశతో...
-  "భ్రూణ హత్యలపై తీసిన ఎపిసోడ్‌లో బాధితుల ఆవేదన వింటున్నప్పుడు చాలాసార్లు కంట తడిపెట్టాను. మూడు సందర్భాల్లో భోరున ఏడ్చాను. ఆ దృశ్యాలను ఎడిట్ చేశాం. ఎందుకంటే... నేను పది నిమిషాలు ఆగకుండా ఏడ్వడం మీరు చూడలేరు.''
-  "నాకు ప్రేక్షకుడిగా మీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వండి. ఆది వారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే సత్యమేవ జయతే కార్యక్రమం చూడండి. నాతో కలిసి ఒక్క అడుగు వేయండి.''
-  "నా స్టార్‌డమ్‌ను ప్రదర్శించేందుకో, నేను చెబితే వింటారనో ఈ కార్యక్రమం చేయడం లేదు. కానీ... 'అసలు ఏం చెబుతున్నాడో చూద్దాం' అని మాత్రం టీవీ ముందుకు వస్తారు. టీవీ మాధ్యమానికి ఉన్న శక్తి, మా టీమ్ చేసిన కృషి... ఇవన్నీ కలిసి ప్రతి ఇంటిలో మార్పు వస్తుందనే ఆశ మాత్రం నాలో ఉంది''.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy birthdaysp balasubramaniam
Padmasri dr d nageshwar reddy interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles