Interview with gundu hanumantha rao

gundu hanumantha rao, comedian gundu hanumantha rao, jandhyala, aha naa pellanta, tollywood, telugu, cinema, movies, mp3, music, films, movies, profiles, showtimes, chiranjeevi, NTR,

gundu hanumantha rao, comedian gundu hanumantha rao, jandhyala, aha naa pellanta, tollywood, telugu, cinema, movies, mp3, music, films, movies, profiles, showtimes, chiranjeevi, NTR,

Interview With Gundu Hanumantha Rao.GIF

Posted: 02/14/2012 06:58 PM IST
Interview with gundu hanumantha rao

Interview_With_Gundu_Hanumantha_Rao

గుండు హనుమంతరావు గారి పరిచయం :

Gundu-Hanumantha-Raoహాస్యనటులు సామాన్యంగా ఇచ్చేదానికంటే గుండు హనుంతరావు సంభాషణ శైలిలో స్పష్టత కనిపిస్తుంది. అది బహుశ ఆయన నాటకానుభవం వలన వచ్చి ఉంటుంది. హాస్య నటన అయినంత మాత్రాన పదాల్ని తేల్చి వేయటం అస్పష్టంగా గునుక్కోవటం కాకుండా గుండు హనుమంతరావు వాచకంలో తెలుగు పదాలు సుస్పష్టమైన ఉచ్ఛారణకు నోచుకోవడం విశేషం.

"అహ నా పెళ్ళంట" సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన గుండు హనుమతరావు గొప్ప హాస్య నటుడు. ఈయన టి వి సీరియల్లో కూడా నటిస్తున్నారు. ఈయన నటించిన అమృతం సీరియల్ బాగా హిట్ అయ్యింది. తెలుగు సినిమా హాస్య కుటుంబంలో నవ్వుల గుండుగా పేరు తెచ్చుకొని, మొన్నటి హీరోల ప్రక్కన ప్రెండ్ పాత్రలు పోషించి మంచి నటుడిగా పేరొందారు.

గుండు హనుమంతారావు నటించిన తొలి సినిమా జంధ్యాల గారు రూపొందించిన 'అహ నా పెళ్లంట'. అందులో ఆయన హోటర్ బేరర్ కేరక్టర్ చేశాడు. అప్పుడు ఇంత ప్రసార సాధనాలు లేవు కాబట్టి ఆయనకు ఆలస్యంగా కబురంది, ఆలస్యంగా ఆయన వెళ్లడంతో ఆ పాత్ర జెన్నీకి వెళ్లింది. దాంతో క్లైమాక్స్ లో చెవిటి పెళ్లికొడుకు తండ్రిగా నటించే అవకాశం వచ్చింది. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన 'ఇదేమిటి?' నాటకంలో ఆయన నటించినప్పుడు స్టేజి మీద ఆయన నటన చూసిన జంధ్యాల ఆయనకు కబురు చేసారు.
'అహ నా పెళ్లంట' రిలీజయ్యాక 50 సినిమాల దాకా వరసపెట్టి సంతకాలు చేశాడు గుండు హనుమంత రావు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతూ ఉండేవాడు. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'మాయలోడు', 'యమలీల' సినిమాలు విడుదలయ్యాక తర్వాతనే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాడు. విజయవాడ యువరాజ్ థియేటర్లో 'అహ నా పెళ్లంట' విడుదలైన మొదటిరోజు బ్రహ్మానందంతో కలిసి ఆ సినిమా చూశాడు. అందులోని ప్రతి సీనుకీ, ప్రతి డైలాగుకీ జనాలు విరగబడి నవ్వడాన్ని చూడటం మంచి అనుభవం చాలా సార్లు చెబుతుంటాడు. అప్పట్నించీ కామెడీ పాత్రలు, సెంటిమెంట్ పాత్రలు, ఏడుపుగొట్టు పాత్రలు వంటి అనేక రకాల పాత్రలు చేశాడు. అయితే గుండు హనుమంత రావు సినిమా రంగానికి రాకముందు మిఠాయి వ్యాపారం చేసేవాడు.

అయితే ఆయన జీవితంలో మర్చిపోలేని సందర్భం ఏదయ్యా అంటే... 1978లో ఓ నాటకంలో నటించినప్పుడు ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం. అది నా గురువు బి.ఎస్.ఆర్. మూర్తి డైరెక్ట్ చేసిన నాటకం. నేను సినిమా ఆర్టిస్టునవుతానని ఎప్పుడూ ఊహించలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అది వ్యాపార ప్రకటనలు కానివ్వండి, టెలివిజన్, రేడియో కార్యక్రమాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటూ వచ్చి నేడు ఈ స్థాయికి ఎదిగాడు.

ప్రొఫైల్ :

  • పేరు : గుండు హనుమంతరావు ,
  • ఊరు : విజయవాడ ,
  • నాన్న : కాంతారావు -చాకొలేట్ వ్యాపారము ,
  • అమ్మ : సరోజినీ ,

నటించిన కొన్ని తెలుగు సినిమాలు :

  • ఎవడితే నాకేంటి (2007)
  • పెళ్ళాం ఊరేలితే (2003)
  • మృగరాజు (2001)
  • యమజాతకుడు (1999)
  • మావిచిగురు (1996)
  • రిక్షావోడు (1995)
  • నెంబర్ వన్ (1994)
  • శుభలగ్నం (1994)
  • యమలీల (1994)
  • మాయలోడు (1993)
  • పేకాట పాపారావు (1993)
  • ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం (1993)
  • కొబ్బరి బొండం (1991)
  • హాయ్ హాయ్ నాయక (1989)
  • రాజేంద్రుడు గజేంద్రుడు ,
  • ఘటోత్కచుడు ,
  • అన్నమయ్య ,
  • గౌతం యస్ యస్ సి.

 హాసం క్లబ్ ఆధ్వర్యంలో "ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు"కు 28 జనవరి 2012న కళాసుబ్బారావు కళావేదికలో సత్కారం జరిగింది. గుండు హనుమంతరావు గారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆంధ్రవిశేష్ ఆకాంక్షిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with director sukumar
Susarla title 1gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles