Pawan Kalyan Interesting Comments On Amaravathi | Hyderabad City | Ap Capical Issue | Sardar Gabbar Singh Schedules

Pawan kalyan interesting comments on amaravathi hyderabad cities

pawan kalyan, amaravathi, hyderabad city, amaravathi invitation card, amaravathi updates, pawan controversies, pawan news, sardar gabbar singh, gabbar singh shooting

Pawan Kalyan Interesting Comments On Amaravathi Hyderabad Cities : Pawan Kalyan Interesting Comments By Comparing Amaravathi And Hyderabad Cities

అమరావతి మరో హైదరాబాద్ కాకూడదు : పవన్

Posted: 10/17/2015 01:55 PM IST
Pawan kalyan interesting comments on amaravathi hyderabad cities

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని ‘అమరావతి’ శంఖుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్, సింగపూర్, దేశ ప్రధానమంత్రులతోపాటు కేంద్రమంత్రులు, ఇతర నేతలు, కొందరు ప్రముఖుల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కూడా ఏపీ మంత్రులు ఆహ్వానించారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపనకు హాజరుకావాలని ఏపీ మంత్రులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి మరో హైదరాబాదు కాకూడదని వ్యాఖ్యానించిన ఆయన గతంలో చేసిన తప్పులు పునరావృతం కారాదని కోరుకున్నారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుహృద్భావ వాతావరణంలో మెలగాలన్నారు. ఒకరిపై మరొకరు ఎల్లకాలం ద్వేషం కొనసాగించలేరని కూడా ఆయన అన్నారు. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని తనకూ ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే తన తాజా చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇందుకు అనుమతించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత షెడ్యూల్ ను ముగించుకుని తదుపరి షెడ్యూల్ కోసం గుజరాత్ వెళుతున్నామని తెలిపారు. అక్కడి షూటింగ్ పరిస్థితులపైనే తాను శంకుస్థాపనకు హాజరయ్యే అంశం ఆధారపడి ఉందన్నారు. తనకు మాత్రం శంకుస్థాపనకు హాజరు కావాలనే ఉందని చెప్పారు. ఇక ఏపీ ప్రభుత్వానికి సలహాలిచ్చేంత అనుభవం తనకు లేదని పవన్ అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  amaravathi invitation  sardar gabbar singh  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more

Today on Telugu Wishesh