Ganta Srinivas Rao Suggest KCR to change his behaviour like chandrababu naidu | section 8 controversy

Ganta srinivas rao suggest kcr to change his behaviour on section 8

Ganta Srinivas Rao, Ganta Srinivas Rao controversy, cm kcr, cm kcr controversy, kcr updates, Ganta Srinivas Rao updates, Ganta Srinivas Rao kcr news, chandrababu naidu, chandrababu controversy, section 8 controversy, section 8 in hyderabad, central government governor narasimhan

Ganta Srinivas Rao Suggest KCR to change his behaviour on section 8 : Ganta Srinivas Rao makes controversial comments in telangana cm kcr and suggest him to change behaviour as like cm chandrababu naidu.

కేసీఆర్.. బాబుని చూసి నేర్చుకో?

Posted: 06/24/2015 05:10 PM IST
Ganta srinivas rao suggest kcr to change his behaviour on section 8

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెక్షన్-8 విషయంపై విస్తృతంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సెక్షన్-8 అమలు అయ్యేలా టీడీపీ వర్గాలు పట్టు సాధిస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ నరసింహన్ తో ఈ సెక్షన్-8కి తమ ప్రభుత్వం వ్యతిరేకంగా వున్నట్లు పేర్కొన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ సెక్షన్-8కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం దీని అమలుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనిని అమలుపరచాల్సిందేనని టీడీపీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గంటా శ్రీనివాసరావు కూడా ఈ సెక్షన్-8పై మాట్లాడుతూ.. కేసీఆర్ కి ఉచిత సలహా ఇచ్చారు.

హైదరాబాదులో ఓ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అన్నీ అమలు చేస్తున్నప్పుడు సెక్షన్-8 మాత్రం ఎందుకు అమలు కాదని అడిగారు. గవర్నర్ సెక్షన్-8 అమలు చేస్తారని తాము ఆశిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. సెక్షన్-8పై కేసీఆర్ ది వితండవాదమని ఆయన తెలిపారు. దీనిపై కేసీఆర్ అనవసరంగా వివాదం రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల నుంచి ప్రజలదృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ఇలా వివాదం రేపుతున్నారని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ కి ఉచిత సలహా ఇస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని చూసి ముఖ్యమంత్రి అంటే ఎలా వుండాలో తెలుసుకో’ అని గంటా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganta Srinivas Rao  kcr  chandrabau naidu  section 8  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more