Revanth reddy karimnagar sirisilla gun controversy trs minister kcr

revanth reddy news, revanth reddy latest news, revanth reddy gun controversy, telangana ministers, telangana mlas, revanth reddy controversial comments

revanth reddy karimnagar sirisilla gun controversy trs minister kcr : T tdp minister revanth reddy makes controversial comments that he will hold the gun another time to save telangana tdp leaders

మళ్లీ తుపాకీ పడతా : రేవంత్ రెడ్డి

Posted: 02/28/2015 03:40 PM IST
Revanth reddy karimnagar sirisilla gun controversy trs minister kcr

2011లో కరీంనగర్ లో జరిగిన రణభేరి సభకు రేవంత్ రెడ్డి తుపాకీ వెంటబెట్టుకున్న విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఆనాడు ఆయనలా తనతోపాటు తుపాకీ తీసుకెళ్లడంతో పెద్ద దుమారమే రేగింది. ఉస్మానియా విద్యార్థులపై రేవంత్ తుపాకీ గురిపెట్టాడని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆ వ్యవహారం పెద్ద రచ్చరచ్చ జరిగింది. అయితే.. తాను మళ్లీ ఇప్పుడు తుపాకీ పడతానంటూ రేవంత్ మరోసారి బాంబు పేల్చాడు.

ఇటీవలే టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై సంచలన విమర్శలు చేశారు. ఆయన్ను కుక్కలతో పోల్చుతూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. తనను కుక్కలతో పోల్చడంపై తనదైన రీతిలో వారికి సమాధానం చెప్పారు. ప్రజల కోసం పోరు సాగించే క్రమంలో తాను శునకవిశ్వాసం ప్రదర్శిస్తానంటూ టీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో మళ్లీ తుపాకీ పడతానంటూ ఆయన అన్నారు.

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి తుపాకీ పడతానని స్పష్టం చేశారు. 2009లో ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే కేటీఆర్ గెలిచారని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు టీడీపీని ఖాళీ చేస్తామని వ్యాఖ్యానించడం సబబు కాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  trs ministers  political controversies  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more