భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాళ్ లోని కిషన్ నగర్ లో ఆ పార్టీ అభ్యర్థి సత్యబ్రత ముఖర్జీ తరుపున విస్త్రుత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పై, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై, పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ , త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలు బయటకు వేరు వేరుగా ఉన్నా, తెరవెనుక మాత్రం తనను అడ్డుకోవడమే వారి లక్ష్యమని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా వస్తాయని, కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అందులో ఎటువంటి సందేహం లేదని, రాజకీయ లబ్ది కోసం రాద్దాంతం చేస్తున్న పార్టీలను, నాయకులను తుంగలో తొక్కండని ఆయన పిలుపునిచ్చారు. నాకు ప్రజలు దేవుళ్ళతో సమానం.
కాబట్టి నేను ఓట్లు అడుక్కోవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదని, దేశాన్ని దోచుకోవడం కంటే అడుక్కోవడమే ముఖ్యమని, దేశాన్ని దోచుకునే వారిని అడ్డుకునేందుకే నేను మీ ఓట్లు అడుక్కుంటున్నానని, సోనియా జీ నేను దేశాన్ని దోచుకోవడం లేదని, ఓట్లు మాత్రమే అడుక్కుంటున్నానని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ పై విమర్శలు చేస్తూ.. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి బాగో లేదని, ఇక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించాలని కోరారు. బెంగాల్లో భాజాపాకు ఎక్కువ సీట్లు వస్తే మంచి రోజులు వచ్చినట్లేనని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more