కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ బిల్లు పై పార్లమెంట్ లో జరిగిన విషయాలను మీడియాతో చెప్పటం జరిగింది.
* తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన నేపధ్యంలో బిల్లు ముజువాణి వోటుతో ఆమోదం పొందలేదని, ఓటింగ్‌తోనే ఆమోదం పొందిందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
* బిల్లుకు సంఖ్యాబలం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని, సంఖ్యాబలంతోనే బిల్లు నెగ్గిందని అన్నారు.
* బిల్లుపై ఓటింగ్ జరగనందుకు కారణం సభ్యులు తమ స్థానాలలో ఉండకుండా వెల్‌లోకి వెళ్లటమేనని ఆయన అన్నారు.
* బిల్లు విజయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీయే కారణమని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
* తొమ్మిది రోజులు పార్లమెంట్ పూర్తిగా స్తంబించిందని, సెప్పెర్ స్ప్రే ఘటనలతో పార్లమెంట్ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
* కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఉన్నప్పుడు బిల్లుకు మెజారిటీ లేదని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
* బిల్లుపై అనేక పార్టీలు సమర్ధించిన ముఖ్య సవరణలు స్పీకర్ ఆమోదించారు కనుక దీన్ని మూజువాణి ఓటు అనటం సరికాదని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
* కేవలం సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ఆమె ఏ ప్రాంతానికి అన్యాయం చేయదని ఆయన ప్రశంసించారు. సీమాంధ్రకు కూడా ఎటువంటి అన్యాయం జరగలేదని బిల్లులోని సవరణలను పరిశీలిస్తే తెలుస్తుందని జైపాల్ తెలిపారు.
* సభలో పెప్పర్ స్ప్రే లాంటి ఘటనలు జరిగి, 60 సంవత్సరాల పార్లమెంట్ ప్రతిష్ఠ భంగపడిందని, అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే పార్లమెంట్ పరువు మరింత దిగజారుతుందనే ఉద్దేశంతో స్పీకర్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
* బిల్లుకు మద్దతుదారుల సంఖ్యను లెక్కించిన తరువాతే స్పీకర్ మీరా కుమార్ తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర వేశారని ఆయన తెలిపారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more