కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సుజానేలు విడిపోయారంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే పుకార్లు నిజం అని తేల్చేశాడు.గత మూడు నెలలుగా వీరిద్దరు విడి విడిగానే ఉంటున్నారని, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ బర్త్ డే సమయంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదమే వీరి బంధం బీలు వారడానికి కారణం అని, అప్పటి నుండి వీరిద్దరూ కలిసి ఉండటం లేకా హృతిక్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సుజానే దూరంగా ఉంటూ వచ్చింది.
ఇక నిన్న సాయంత్రం ఓ పత్రికతో హృతిక్ మాట్లాడుతూ... నేటితో నాతో సుజానేల మధ్య ఉన్న దాంపత్య జీవితానికి ముగింపు పడింది. నాతో విడిపోవడానికి సుజానే నిర్ణయిచుకుంది. 17 ఏళ్ళ బంధానికి, 13 ఏళ్ళ దాంపత్య జీవితానికి ముగింపు పలికాం. ఇన్ని సంవత్సరాల వీరి కాపురానికి రెహాన్ (7), హ్రిదాన్(5) ఇద్దరు సంతానం. హృతిక్ ప్రకటన విన్న బాలీవుడ్ మొత్తం షాక్ తిన్నది.
ఈ సమయంలో మమ్మల్ని ప్రశాంతంగా వుండనీయమని మీడియాను కోరాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ కూతురైన సుజానేతో హృతిక్ వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. అయితే సుజానే విడాకులు తీసుకోవడానికి ఓ బలమైన కారణం చెబుతున్నారు.
గత కొంత కాలంగా హృతిక్ విదేశాల్లో ప్రియురాలిని మెయింటేన్ చేస్తున్నాడని, ఈ విషయం రెండుమూడేళ్ల క్రితమే సుజానే కి తెలిస్తే హృతిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆయన తీరుతో మార్పు రాలేదని అందుకే విడిపోవాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతుంది బాలీవుడ్ లో.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more