రాజకీయ నాయకులు రోజు రోజుకి హద్దులు దాటుతున్నారు. ప్రజా నాయకులం అనే విషయం మరిచిపోయి మాటల యుద్దం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా రాజకీయ నాయకులు ఒకరి పై ఒకరు బూతులు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయి పరస్పరం తింటుకుంటున్నారు. నువ్వా నేనా అంటూ.. అసభ్యకరమైన పదాలను మీడియ ముందే వాడుతున్నారు.
అవసరమైతే ముష్టి యుద్దానికి కూడా సై అంటున్నారు కొంత మంది రాజకీయ నాయకులు ఈరోజు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పై.. సీమ రెడ్డిగారు తీవ్రస్థాయిలో బూతుల దండకం చదివారు. ఈ ఇద్దరు ఒకరిని మించి మరోకరు మాటల తూలుతున్నారు. కావూరి రాయల తెలంగాణ చెయ్యాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో సీమ నాయకులు వర్సెస్ కోస్తా నాయకులు మాటల తూటల యుద్దం చేసుకున్నారు. కావూరి పై రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్) నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
రాయల తెలంగాణ ప్రతిపాదన చేసిన కావూరిపై పరుష పదజాలంతో బైరెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమ జోలికొస్తే చీరేస్తా అంటూ ఊగిపోయారు. కావాలంటే కోస్తా ప్రాంతాన్ని చీల్చుకోమని సలహాయిచ్చారు. 'కోయాలనుకుంటే కోస్తాను కోసుకోండి, సీమను కోయాలని చూస్తే... కోస్తాం జాగ్రత్త' అంటూ బైరెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసే హక్కు కావూరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్రకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను బహిరంగంగా సమర్ధించిన జేసీ దివాకర్ రెడ్డిని బైరెడ్డి ఒక్కమాట అనకపోవడం గమనార్హం.
అయితే హైదరాబాద్ లో జరిగిన రాయలసీమ ప్రజా ప్రతినిధుల సమావేశంలోనూ కావూరిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త రాజధానిని కృష్ణా జిల్లాకు తరలించాలన్న కుట్రతోనే కావూరి రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారని మండిపడినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మరుగున పడకుంటే కావూరిని కడిగిపారేసే వాళ్లమని సీమా నాయకులు అంటున్నారు. రాష్ట్ర విభజనతో.. కలిసిమెలిసి ఉన్న రాజకీయ నాయకులు మీసాలు మేలిసి, తొడలు కొట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. రాష్ట్ర విభజన సమస్య త్వరగా పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. జరుగుతున్న శీతకాలం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పై ఎలాంటి రచ్చ జరుగుతుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more