Motkupalli narasimhulu fire on kcr

motkupalli narasimhulu, motkupalli narasimhulu fire on kcr, kcr vs motkupalli, narasimhulu comments on kcr, telangana issue, ap bifurcation, motkupallinarasimhulu comments on kcr, tdp mla motkupalli narasimhulu, trs leader kcr, tdp vs trs, chandrababu vs kcr, trs leader motkupalli narasimhulu, kcr comments on motkupalli, latest telugu news, breaking news, headlines

motkupalli narasimhulu fire on kcr, Motkupalli Narasimhulu Comments on KCR

కేసిఆర్ పరువు తీసిన లీడర్?

Posted: 12/11/2013 06:28 PM IST
Motkupalli narasimhulu fire on kcr

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరువును తెలంగాణ ప్రాంతం నాయకుడే బజార్లో పెట్టాడు. ప్రతిసారి మీడియా ముందు కేసిఆర్ ఆంద్రవాళ్లో, సీమాంద్రోళ్లు అంటూ.. విడదీసి పలకటం ఆయనకు బాగా అలవాటైంది. తెలంగాణ ప్రాంతం, ఆంద్ర ప్రాంతం అంటూ ప్రాంతాలను వేరు చేసి, తెలుగు ప్రజలను రెండుగా వీడదీసింది కేసిఆరే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అంటున్నారు. అసలు ఆంద్ర ఎవరిది, తెలంగాణ ఎవరిది అనే విషయం కేసిఆర్ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రా, తెలంగాణ వేరుకాదని, రెండు ప్రాంతాలు తమకు ఒక్కటేనని, తెలంగాణ కేసీఆర్ అబ్బ సొత్తు కాదని మోత్కుపల్లి నర్సింహలు పేర్కొన్నారు.

 

అసలు కేసీఆర్‌ది విజయనగరం జిల్లా, బుడ్డిపేటని, కే. కేశవరావుది విజయవాడని, విజయశాంతిది రాజమండ్రి నుంచి వచ్చిన వారేనని పేర్కొన్నారు. సీమాంద్రుడి చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండడం దురదృష్టకరమని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్ అమ్ముడు పోయే సరకని, ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసమే తెలంగాణ రావొద్దని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని టీడీపీ కోరుకుంటోందని, సీమాంధ్రకు రాజధాని ఎక్కడో కూడా కేంద్రం ఇంతవరకు చెప్పాలేదని మోత్కుపల్లి విమర్శించారు.

 

తెలుగుదేశం పార్టీ వల్లే బతికి, పైకి వచ్చిన నీవు, మమల్ని పార్టీ వదిలి రమ్మంటావా? అంటూ మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరును ఖండించకుండా టీడీపీని కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు సీఎం కిరణ్ చేత అడ్డంకులు సృష్టిస్తున్న సోనియాను కేసీఆర్ ఎందుకు విమర్శించడంలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మానం చేస్తానని కెసిఆర్ అంటున్నాడని, ఆయన చేసేది పునర్నిర్మాణమా? లేక పెత్తందార్ల పునర్నిర్మాణమా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉండే కెసిఆర్‌కు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి, నైతిక అర్హత లేవన్నారు. కెసిఆర్ ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన విషయం మరిచిపోవద్దని హితవు పలికారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more