Cong core panel for introducing telangana bill in january

Cong core panel for introducing Telangana bill in January, Congress Core Committee Meeting on T Bill, Congress Core Committee Meeting on T Bill, Cong core panel for introducing Telangana bill in winter session

Cong core panel for introducing Telangana bill in January, Congress Core Committee Meeting on T Bill, Congress Core Committee Meeting on T Bill, Cong core panel for introducing Telangana bill in winter session

అబ్బే డిసెంబర్ లో కాదు... జనవరిలో...

Posted: 11/30/2013 10:22 AM IST
Cong core panel for introducing telangana bill in january

తెలంగాణ ఇవ్వడం అంటే దోసె వేయడం అంతా ఈజీ కాదు... నెలకు ముప్పై రోజులే ఉంటాయి కానీ నెలంటే ముప్పై రోజులు మాత్రమే కాదు... డిసెంబర్ 31 తరువాత తెలంగాణలో ఏం జరుగుతుంది అని అడిగితే... జనవరి ఒకటి వస్తుంది... ఏంటి ఇవన్నీ మాటలు ఎక్కడో విన్నట్లు ఉన్నాయనుకుంటున్నారా ? అవును తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడిన మాటలు ఇవి. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ లోనే తెలంగాణ బిల్లు పెడతామని బీరాలు పలికిన పెద్దలు ఇప్పుడు మాట మార్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.

కాంగ్రెస్ కోర్ కమిటీ తాజా భేటీలో తెలంగాణ బిల్లు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒకరు ఎడ్డెం అంటే ఇంకొకరు తెడ్డెం అన్నారు. తీరా సమయం దగ్గర పడటంతో ‘అబ్బే డిసెంబర్ లో అనుకున్నాం కానీ.. సాధ్యపడటం లేదు ’ జనవరిలో ప్రత్యేకంగా పార్లమెంటును ఏర్పరచి బిల్లు పెడతామని కొత్త మాట చెబుతున్నారు. శీతాకాలం అంటే, జనవరిలో కూడా వుంటుంది కదా.. అప్పుడు చూస్కుందాంలే అని కొందరు అధినేత్రికి సూచించినట్లు సమాచారం.

అంతా అయిపోతుందని ఒక నాయకుడు, ఎలా అవుతుందంటూ మరో నాయకుడు అధినేత్రి ముందే వాదులాటకు దిగినంత పని చేయడంతో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరింత లోతుగా చర్చించే బాధ్యతను జీవోఎంపై పెట్టారని, రాబోయే కేబినెట్‌లో కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారని సమాచారం.

ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి... పార్టీ పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండాలంటే కాస్తంత టైంపాస్ చేయాలి. జనవరి వరకు పరిస్థితులు కొన్ని చక్కబడి కలిసొస్తాయన్నది కాంగ్రెస్‌ లాజిక్‌. వారి లాజిక్‌ కూడా చాలాసార్లు వర్కవుట్‌ అయ్యింది. ఇప్పుడూ అవ్వుద్దేమో ? గతంలో లాగ  తెలంగాణ అంశాన్ని సాగదీయడానికి చేస్తోన్న ప్లాన్ లో భాగమే అంటున్నారు తెలంగాణ వాదులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more