రాష్ట్ర విభజన పై హోంశాఖ రహస్య నివేదిక బయటకు వచ్చింది. అయితే ఆ నివేదికలోని కొన్ని పాయింట్లు ఇలా ఉన్నాయి. విజయకుమార్ నేతృత్వాన ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన టాస్క్ ఫోర్స్ బృందం ఈ నివేదకను అందజేసింది.
* ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సిఫార్సు చేస్తూ కేంద్ర మంత్రివర్గ బృందానికి కేంద్ర హోం శాఖ ఒక నివేదికను అందజేసింది.
* రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలలోనూ మావోయిస్టు సమస్యలు, మతోన్మాద సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆంధ్ర ప్రదేశ్‌లో పోలీసు, ఇంటెలిజన్స్ వ్యవస్థలను పటిష్టంగా ఉన్నాయని, అందువల్ల వాటిని కొనసాగించాలని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్‌లో అన్ని రంగాలూ కేంద్రీకృతమై ఉన్నాయని, వీటన్నిటినీ హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు నిర్భయంగా వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలని ఈ నివేదిక పేర్కొన్నది.
* తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలో తెలంగాణ జేఏసీ నాయకులు ఇచ్చిన నినాదాలు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న సీమాంధ్రులలో భయాందోళనలు నెలకొనేలా చేశాయని, అందువల్ల ఆ భయాందోళనలను తొలగించవలసిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతుండడం కూడా సీమాంధ్రులలో భయాందోళనలకు కారణమైందని, ఈ పరిస్థితులు కూడా లేకుండా చేయాలని హోం శాఖ పేర్కొన్నది.
* తెలంగాణ అవతరణ అనంతరం సీమాంధ్రులను మీ ప్రాంతాలకు వెళ్లిపోండి అని ఒత్తిడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటిది జరగకుండా చూడాలని, హైదరాబాద్ సిర్ఫ్ హమారా వంటి నినాదాలు సీమాంధ్రులలో భయాందోళనలు కలిగించాయని ఆ నివేదిక పేర్కొన్నది.
* వివిధ అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేసిన హోం శాఖ రాష్ట్ర విభజన అనంతరం తలెత్తే సమస్యల పరిష్కారానికి వీలుగా గవర్నర్ చేతిలో పదేళ్లపాటు పాలన కొనసాగాలని అందులో పేర్కొన్నది.
* అలాగే ప్రయివేటు రంగంలోను, ప్రభుత్వ రంగంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ కూడా కేంద్ర హోం శాఖ తమ సొంత సమగ్ర పరిశోధన జరిపి సూచనలు అందించింది.
* హైదరాబాద్‌లో ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత కు తగిన ఏర్పాట్లు చేయాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. అందుకు గట్టి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ నివేదిక వివరించింది.
* హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్రకు చెందిన పోలీసు అధికారులను కూడా హైదరాబాద్‌లోనే ఉంచాలని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు.
* సీమాంధ్రులను బలవంతంగా పంపించరాదు, గవర్నర్ చేతిలో పదేళ్లపాటు పాలన ఉండాలి
* ముఖ్యంగా ల్యాండ్ రెవిన్యూ, మున్సిపల్, పోలీసు, ఉన్నత విద్యా రంగాలు గవర్నర్ అజమాయిషీలో ఉండాలని ఈ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
* హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి సర్వీసులు పూర్తి అయ్యేవరకూ హైదరాబాద్‌లోనే ఉండేటట్టు అనుమతించాలని, అలాగే సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా అక్కడే ఉండాలనుకుంటే ఉండేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ నివేదికలో పేర్కొన్నారు.
* రియల్ ఎస్టేట్, విద్య, వైద్య రంగాలు, లాయర్లు, డాక్టర్లు, కన్సల్టంట్లు, వినోద రంగాలలో ఉన్న సీమాంధ్రులకు పూర్తి భరోసా కల్పించాలని ఈ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
* సీమాంధ్రలో కొత్త రాజధానిని నిర్మించడానికి, అందుకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడానికి వీలుగా పదేళ్లపాటు నిధులు కేటాయించాలని కూడా ఈ నివేదికలో కోరుకున్నారు..
* ఐ.టి, ఫార్మా, మౌలిక సదుపాయాలు, హాస్పిటాలిటీ మొదలైన రంగాలలో సీమాంధ్రులకు చెందిన పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంటూ వారు వ్యాపారాలు నిర్భయంగా చేసుకునేటట్టు భరోసా కల్పించాలని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.
* రాష్ట్ర విభజన అనంతరం నీళ్లే పెద్ద సమస్యగా పరిణమిస్తుందని హోం శాఖ టాస్క్ ఫోర్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
* ప్రస్తుతం ఉన్న నీటి పంపకాలకు, ఆయకట్టు పరిరక్షణకూ ఏర్పాట్లు చేయాలని, ఆ మేరకు భరోసా కల్పించాలని ఈ నివేదికలో పేర్కొన్నారు.
* ఉభయ ప్రాంతాలకూ జల పంపిణీ న్యాయంగా జరిగేటట్టుగా ట్రిబ్యునళ్లు ఉండాలని అందులో పేర్కొన్నారు.
* అలాగే, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఈ నివేదకలో పేర్కొన్నారు.
* క్షేత్ర స్థాయిలో పరిస్థితులను జల్లెడ పట్టిన హోం శాఖ ఈ నివేదిక రూపొందించింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more