హైకమాండ్ ఆగమేఘాల మీద అఖిలపక్షం ఏర్పాటు చేయటానికి రెడీ అవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలకి సరికొత్త భయం పట్టుకుంటంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువు గా భయపడుతున్నారు. కాంగ్రెస్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే తుఫాన్ పుట్టిస్తుంది. మరో అఖిలపక్షం పేరుతో మళ్లీ అన్ని పార్టీలను పిలిచి అంతకుముందే తమ స్టాండ్ ఏమిటో నివేదిక ఇవ్వాలని ప్రకటించిన కేంద్రం అన్ని పార్టీలను మళ్లీ ఇరుకున పెట్టి, తమ మీద నింద దించుకోవాలని చూసింది. అయితే ఆ అఖిల పక్షమే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తుఫాన్ లా మారనుంది. విభజనపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించనుండగా కాంగ్రెస్ లో ఇప్పుడు అదే పెద్ద రభసగా మారింది.
కేంద్రం చెప్పిన విధానం ప్రకారం, అభిప్రాయాలని తెలియజేయడానికి ప్రతిపార్టీ నుండి ఒక్కరే రావాలని, నివేదికను కూడా పోస్టు ద్వారా కాని ఇ-మెయిల్ ద్వారా కాని పంపినా ఒక పార్టీ ఒకటే అభిప్రాయం పంపాలని అని కేంద్రం నిబందన విధించింది. నిజానికి ఈ విషయంలో అన్ని పార్టీలని ఇరికించింది అనుకుంటే ఇప్పుడు ఈ విషయంలో అందరికంటే ఎక్కువ కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ నేతలే. ఇప్పటికే ఈ తుఫాన్ కూడా మొదలైంది.
రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ నివేదికను పంపించాలి. బొత్స గారేమో సమైక్య వాదాయే. మరి 'టీ' నేతలు ఊరికే ఉంటారా? బొత్స నివేదిక పంపితే ఊరుకొనేది లేదని పార్టీ అధిష్టానం ఏ అభిప్రాయం తీసుకుందో అదే మన అభిప్రాయంగా పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
అధిష్టానం అభిప్రాయం అంటే సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయమే కనుక సీమాంధ్ర నేతలు అలా పంపితే విభజనకు మనం సిద్దమైనట్లేనని మనమే ఒప్పుకున్నట్లని, అలా చేసే సీమాంధ్ర కాంగ్రెస్ ను మరిచిపోవడమేనని మండిపడుతున్నారు. అందుకే బొత్స రెండు ప్రాంతాల వారితో చర్చలు జరుపుతున్నారు. అఖిలపక్ష తుపాన్ వల్ల కాంగ్రెస్ పార్టీలో రెండు ప్రాంతాల నాయకుల మద్య విభేదాలు తలెత్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more