వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్ లో ‘సమైక్య శంఖారావం ’ పేరిట ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చి నేడు దాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇంత వరకు హైదరాబాద్ లో పార్టీ తరుపున ఒక్క సభను కూడా నిర్వహించని జగన్ తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్ లో సమైక్య సభ పేరుతో సభ నిర్వహించడం విశేషం. తెలుగు జాతిని విడదీసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్న ఢిల్లీ పెద్దలకు సీమాంధ్ర ప్రజల ఘోషను ఈ సభ ద్వారా వినిపించాలని తలచి నిర్వహించిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.
జగన్ పిలుపునందుకున్న సీమాంధ్రులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, సీమాంధ్రలో దెబ్బతిన్న పంటల బాధను పక్కన పెట్టి సమైక్యరాష్ట్రం కోసం భారీగా తరలివచ్చారు. సీమాంధ్రుల రాకతో ఎల్బీ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడంతో హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకున్న వైయస్సార్ సీపీ కోర్టు అనుమతులను సద్వినియోగం చేసుకొని అనుకున్న టైంలోనే సభను ముగించింది. ఈ సభకు వచ్చిన సీమాంధ్రులను ఉద్దేశించి జగన్ దాదాపు యాభై నిమిషాలకు పైగా మాట్లాడాడు. ముందుగా సభకు వచ్చిన ప్రతి హృదయానికి సలాం చేస్తున్నానని, అకాల వర్షం కారణంగా మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించిన జగన్ తరువాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా,లక్షల మంది ఇక్కడ సమావేశం అయ్యామని అన్నారు. గత ఎనభై రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి పుస్తకం పక్కన పెట్టి చదువు అయ్యాక ఎక్కడికి పోవాలని ఉద్యమబాట పట్టారు విద్యార్ధి. తమకు రావలసిన జీతాలను వదలుకున్నారు ఉద్యోగులు,ఉద్యమబాట పట్టి అన్యాయాన్ని ఎదిరించారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీని చూడడానికి ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికి చూస్తుంటే చాలా సంతోషం వేస్తుందని అన్నారు. రాజకీయం అంటే ఓట్లు,సీట్లు మాత్రమే కాదని,పేదవాడి గుండె చప్పుడు అని, పేదవాడికి మేలు చేయడమే రాజకీయమని,చెప్పడానికి ఆరాటపడుతున్న జగన్ అన్నారు. మనం మనుషులం ఆట వస్తువులం కాదు... రాజకీయ చదరంగంలో పావులం అంతకన్నా కాదు... అన్యాయం చేస్తే ఊరికే కూర్చోం... వందేమాతరం గేయం అందుకుంటాం... విప్లవ గీతం అందుకుంటాం... బంగళాఖాతంలో కలపడానికి వెనుకాడం అని చెప్పడంతో సభలో ఒక్కసారి చప్పట్లు మోగాయి. ఇక రాష్ట్రాన్ని విభజించడానికి నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ పై, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , ప్రతిపక్ష నేత అని చంద్రబాబు పై తన దైన శైలిలో విరుచుకుపడ్డారు.
సీమాంధ్రులు ఇంత మంది ఉద్యమం చేస్తుంటే... ఎందుకు చేస్తున్నారని చూడాలన్న ఆలోచించడానికి సోనియాగాందీకి పట్టలేదు..ప్యాకేజీ అడిగిన చంద్రబాబుకు పట్టలేదు..మోసం చేస్తున్న కిరణ్ కు పట్టలేదు.. అని జగన్ విమర్శించారు.వీళ్లందరూ మనుషులా అని బాద కలుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. నదీజలాల గురించి ఈ నాయకులు ఆలోచిస్తున్నారా అని ఆయన అంటూ ఆల్ మట్టి నిందితే కాని కిందికి నీరు రానివ్వని పరిస్థితి గురించి సోనియా, చంద్రబాబు,కిరణ్ లను అడుగుతున్నానని అన్నారు. వీళ్లు అసలు మనుషులేనా అని అడుతున్నా..కర్నాటక,తమిళనాడు ప్రతిఏటా కొట్టుకుంటున్నాయి. గొడవలు జరుగుతూనే ఉన్నాయి.అక్కడ బోర్డులు,ట్రిబ్యునళ్లు ఉన్నా,నీళ్లు రావడం లేదే..అలాంటప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలంకు,నాగార్జునసాగర్ కు ఎక్కడ నుంచి నీరు వస్తాయని జగన్ ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరాన్ని పదేళ్లలో విడిచిపెట్టి వెళ్లిపోవాలట.చదవుకుంటున్న ప్రతి పిల్లాడు చదువు అయిపోయాక, పోనియా,చంద్రబాబు,కిరణ్ లను ఉద్యోగం కోసం ఎక్కడకు పోవాలని అడిగితే ఏమి సమాధానం చెబుతారని, విభజన తర్వాత ఆస్తుల విలువలు పడిపోతే సోనియా ఇస్తారా?చంద్రబాబు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతుందని, ఎన్.జి.ఓ నేతలు టిడిపి అదినేత చంద్రబాబు ను కలిసి రాజీనామా చేసి రాష్ట్ర సమైక్యతను కాపాడాలని కోరితే ఆయన వద్దన్నారు.చంద్రబాబు దీక్ష విరమించే సమయానికి కిరణ్ ఉద్యోగ సంఘాలను భయపెట్టి సమ్మెలను విరమింప చేశారని అన్నారు. చంద్రబాబు విభజించాలని దీక్ష చేశారని జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకున్న రోజునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని జగన్ ప్రశ్నించారు.
సోనియాగాంధీ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడే చేస్తారని,అప్పుడు వచ్చి ప్రజల వద్ద మొసలి కన్నీళ్లు కార్చుతారని జగన్ అన్నారు. శాసనసభ సమావేశం పెట్టి సమైక్య తీర్మానం పంపుదామని అని అడిగితే ఆయన అంగీకరించలేదని అన్నారు. ఇంతమంది ఘోష విన్న తరువాత ఇప్పటికైనా జ్ఞానోదయం అయి నిర్ణయం మార్చుకుంటారో లేక చరిత్ర హీనులవుతారా అన్నది చూద్దాం అని అన్నారు. పార్లమెంటులో పోరాటం చేద్దాం, ఆ తర్వాత ఎన్నికల వరకు పోరాటం చేద్దాం, ముప్పై స్థానాలు మనమే తెచ్చుకుందాం.. ఎవరు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దాం అని , ఢిల్లీ రాజకీయాన్ని మనమే శాసిద్దాం అని , డిల్లీ కోటలు బద్దలు కొడతాం అని ఆయన అన్నారు. చివర్లో జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర, జై వైఎస్‌ఆర్ అంటూ ప్రసంగాన్ని ముగించిన జగన్ సమైక్య శంఖారావం సభ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more