రాష్ట్ర విభనపై కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీల మద్య మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని అందరు అనుకున్నారు. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి .. టిఆర్ఎస్ పార్టీ శత్రువుగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు మీడియా ద్వారా చెప్పినప్పటికి ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ జరుగులేదు. కాంగ్రెస్ కూడా టిఆర్ఎస్ ను పెద్దగా పట్టించుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ విలీనం కాకపోతే.. తమ రాజకీయ పరిస్థితి ఏమిటి అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేందుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనివార్యమవుతున్నందున ఇక వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరుపై నడకే అని ప్రత్యేక రాష్ట్రంలో అధికారం తమదే అని నేతలు భావించారు. అయితే తాజాగా విలీనం అంశంపై టిఆర్‌ఎస్ దాటవేత వైఖరిని ప్రదర్శించడం టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కలవర పరుస్తోంది. టిఆర్‌ఎస్ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అంత సులువు కాదని వారే అంగీకరిస్తున్నారు.
టిఆర్‌ఎస్ విలీనం కాకపోతే ఆ పార్టీతో పొత్తు కూడా ఉండదనేది నేతల అంచనా. తెలంగాణలో ఉన్న మిగిలిన ప్రధాన పార్టీలు బిజెపి, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, వామపక్షాలు విడివిడిగా పోటీ చేస్తాయని... ఆ పార్టీల మధ్య కూడా పొత్తులు సాధ్యం కాకపోవచ్చనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అదే జరిగితే తెలంగాణలో దాదాపుగా పంచముఖ పోటీ నెలకొననుంది. టీడీపీ అధ్యక్షుడు రెండు కళ్ల ధోరణితో ఆపార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు త్వరలో 'చేయి'అందుకోనున్నట్లు సమాచారం.
టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు 15 మందితో పాటు ఆ పార్టీ కీలక నేతలు మరికొందరు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారని,ఈ మేరకు వారు తమ హై కమాండ్ పెద్దలతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నారు. ఇలా టిడిపి నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే తమ పరిస్ధితి ఏంటంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇటీవల పిసిసి చీఫ్ బొత్సను ప్రశ్నించటం జరిగింది. దీంతో ముందస్తు ఒప్పందం మేరకు టిడిపి ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ నేతలంటున్నారు. దాంతో టిడిపిలో మిగిలిన నేతలు కొందరు టిఆర్‌ఎస్‌లో మరికొందరు బిజెపిలో చేరుతారనేది వారి అంచనా. ఇలాంటి పరిణామాలను పసిగట్టే తమ హై కమాండ్ పెద్దలు టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అంశంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఇక విలీనంపై టీఆర్ఎస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న మాటకు కట్టుబడతానని రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా ప్రకటించడం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆ తర్వాత రెండు నెలలకు పైగా టీఆర్‌ఎస్ సైలెంట్ గా ఉండిపోయింది . అయితే కేంద్రం జీవోఎం వేసిన అనంతరం టీఆర్ఎస్ స్వరం పెంచింది. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం పార్టీ కచ్చితంగా మనుగడలో ఉండి తీరాల్సిందేనని పలువురు టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో పూర్తిగా విలీనం కాకుండా, ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకునే దిశగా టీఆర్‌ఎస్ నాయకత్వంలో ఆలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం అయ్యే కొద్ది.. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ విలీనం చెయ్యలేం కానీ, పొత్తు పెట్టుకుంటాం అంటూ .. రాజకీయ సందేశాలు పంపుతుంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలాంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more