చివరి బంతి పడే వరకు ఛాన్స్ ఉందని చెప్పిన సమైక్య వీరుడు.. బంతిపడకముందే.. అవుట్ అయ్యాడు. సమైక్యాంద్ర వాదిగా ముద్రపడిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సమైక్యాంద్ర పై యూటర్న్ తీసుకున్నారు. మీది చిత్తూరే.. మాది చిత్తూరే అనే మాటల్లో ఉన్న అర్థం ఏమిటో తెలియాక సీమాంద్ర ప్రజలు సమైక్యాంద్ర కోసం ఉద్యమం చేయటం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమైక్యతపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు. ఏపీ ఎన్జీఓ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. తన చేతిలో ఏమీలేదని, కేంద్రం తరపున ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పారు.
ఆర్టికల్ 371(డి)పై కేంద్రంతో మాట్లాడతానన్నారు. 2014 వరకు రాష్ట్రం విడిపోదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై జీఓఎంను కలవండని చెప్పారు. విభజనను అడ్డుకునే ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నానన్నారు. సమ్మె విరమించాలని కోరారు. తాను కూడా మీతో కలిసి ఉద్యమం చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చలు ముగిసిన అనంతరం ఏపీఎన్జీఓ నేతలు అంతర్గతంగా సమావేశమయ్యారు. కొందరు సమ్మె విరమించడానికి సంసిద్ధత తెలుపుతుంటే, మరికొందరు సమ్మె కొనసాగించాలని అంటున్నారు. సమావేశం ముగిసిన తరువాత వారు తమ నిర్ణయం ప్రకటిస్తారు.
సమ్మె విరమణ
ఏపీ ఎన్జీఓలు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మళ్లీ మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి ఉద్యోగులు విధులకు హాజరవుతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు ముగిసిన అనంతరం ఏపీఎన్జీఓ నేతలు అంతర్గతంగా సమావేశమయ్యారు. సీఎం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఏం చేయాలనే అంశంపై చర్చించారు. కొందరు సమ్మె విరమించాలంటే, మరికొందరు కొనసాగించాలన్నారు. చివరకు తాత్కాలికంగా సమ్మె విరమించాలని నిర్ణయించారు.
అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల వరకే సమ్మె విరమణ అని చెప్పారు. సమైక్యవాదానికి తాను కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులకు జరిగే నష్టంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మళ్లీ సమ్మె ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశాలు కొనసాగినన్ని రోజులు తాము సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమ్మె కాలానికి జీతం గురించి తాము చర్చించలేదని అశోక్ బాబు చెప్పారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసిన ఫలితం ఏమిటని.. సీమాంద్ర ప్రజలు అడుగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more