తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ చెప్పడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావుకు పిడుగులాంటి వార్త అని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఈరోజు ఎద్దేవా చేశారు. 2014 వరకు తెలంగాణ రాకుంటే వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకుందామని ఆయన కలలు కన్నారని అవి కల్లలు కావడంతో ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి చెప్పాల్సింది చెప్పారన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలంగా ఉండటం, తెలంగాణ రావడం కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. హైదరాబాద్ లో జరిగిన సకల జన భేరీ సభను కెసిఆర్ కబ్జా చేశారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రులను రెచ్చగొట్టేలా, అవమానపరిచేలా కేసీఆర్ మాట్లాడడం సరికాదని రేవంత్‌రెడ్డి అన్నారు. విజయం సాధించిన వారు ఒదిగి ఉండాలని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు.
కెసిఆర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరు దురాశపరులన్నారు. వారిద్దరు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రకటనతో ఆయన కలలు పేకమేడల్లా కుప్పకూలాయన్నారు. తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించలేరన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన వచ్చి అరవై రోజులైనా బిల్లు ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, వారు ఆందోళనలను నివృత్తి చేయాల్సి ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు. సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడాలని, హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంద్రులకు రక్షణ కల్పించాలని టీడీపీ కోరుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపడంలేదని ఆయన ఆరోపించారు. సోనియా నరబలి తీసుకునే తీసుకునే గ్రామదేవతగా మారరని ఆయన ధ్వజమెత్తారు.
దోచుకుంది కేసీఆరే
ఎవరి ఉద్యోగాలు ఎవరూ లాక్కోలేదని, సీమాంధ్ర వ్యాపారాలను దోచుకుంది కేసీఆరే అని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమార్ మండిపడ్డారు. ఈరోజు ఉదయం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు ఎవరినీ దోచుకోలేదన్నారు. సీమాంధ్రలో మేధావులే లేరన్న కేసీఆర్ గతంలో టీడీపీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు మీకు రాక్షసుల్లా కనబడుతున్నారా అని నన్నపనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీమాంద్రులను ఏమీ పీకలేరని
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కేసీఆర్, జగన్, బొత్స కుట్ర పనుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేకేలు ఎంతమంది తలుచుకున్నా హైదరాబాద్‌లో ఉన్న సీమాంద్రులను ఏమీ పీకలేరని హెచ్చరించారు. ఆంధ్రాలో మేధావులే లేరంటున్నావు...నీ కుమారుడిని గుంటూరులో ఎలా చదివించావని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సంస్కారం లేదని సోమిరెడ్డి విమర్శించారు. టి.జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీలు నెల రోజులు కుస్తీ పట్టినా గ్రౌండ్ నిండలేదని...కర్నూలులో జేఏసీ నేత పిలుపునిస్తే లక్షల మంది తరవచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిర్ప్ హమారా అని కేసీఆర్ కాదు తామూ అంటున్నామని ఆయన అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులే క్రూర మృగాలు అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more