ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ సరైనది కాదని, దాన్ని చించిపారెయ్యాలని, రాజ్యాంగ విరుద్ధమని, రాహుల్ గాంధీ ఘాటుగా మాట్లాడినదానిమీద వ్యాఖ్యానిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ అలా వ్యాఖ్యలు చెయ్యటం కాదు నేరచరిత గల వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చెలామణీ అయ్యే అటువంటి ఆర్డినెన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున జాతికి క్షమాపణ చెప్పాలన్నారు.
మన్మోహన్ సింగ్ కి ప్రధాని పదవిలో ఉండే అర్హత ఇక లేదన్నారు చంద్రబాబు. ఈ సంక్షోభానికంతా కారణం ఆయనే కనుక బాధ్యతను విస్మరించకుండా నడుచుకోవలన్నారాయన. జాతీయ ఎన్నికల పరిశీలకుల దగ్గరున్న సమాచారం ప్రకారం నేరచరితగల వాళ్ళు గతంలో 10 శాతం ఉంటే అది ఇప్పుడు 30 శాతానికి పెరిగిందని, వైకాప అధ్యక్షుడు జగన్ లాంటివాళ్ళు చాలామంది పుట్టుకొచ్చారని, వాళ్ళందరినీ రాజకీయాలలోకి రానివ్వటం సరికాదని చంద్రబాబు అన్నారు
కాంగ్రెస్ పార్టీకి యువరాజు హోదాలో ఉన్న రాహుల్ గాంధీ అదాటున నిద్రలేచి నేనొప్పుకోను, ఆ కాగితాలను చించెయ్యండనటం కాదు ఆ అర్డినెన్స్ సోనియా గాంధీకి తెలియకుండానే పాస్ చెయ్యటం జరిగిందా అని ప్రశ్నించారు. పైగా ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమని అంటారా. ఇదేనా బాధ్యయుతమైన హోదాలో జాతీయ పార్టీలో పనిచేస్తూ యువ నాయకుడిగా మాట్లాడాల్సిన మాట అంటూ చంద్రబాబు విమర్శించారు. చిన్నపిల్లవాడిలా మాట్లాడటం సరి కాదన్నారాయన.
ఆర్డినెన్స్ విషయంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల ప్రమేయాన్ని తప్పుపట్టిన చంద్రబాబు ట్విట్టర్ లో కూడా దీని గురించి రాస్తూ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని మాటిమాటికీ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ని నాన్సెన్స్ అని రాహుల్ గాంధీ అన్నందుకు అది నిజం కాకపోతే ప్రధానమంత్రి రాజీనామా చెయ్యాల్సిందేనన్నారాయన.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more