ఎవరి నోట విన్నా ఒకటే మాట పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది భేష్ భేష్ అని. పైరసీ ద్వారా లీక్ అయిన స్టోరీ మరి ఇతర సమస్యలను చాకచక్యంగా అధిగమించిన ఈ చిత్రానికి చెందినంత వరకు ఇంతవరకు ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలూ రాలేదు.
అయితే సినిమాని సినిమాలా చూడకుండా డైలాగ్ ల వెనక ఉన్న అంతరార్థాలు, రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యలు, ఏదో ఒక వర్గాన్ని అపహాస్యం చేసారంటూ ఆందోళనలు- ఇలాంటివి మామూలుగా వస్తుంటాయి కానీ ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎంతో జాగ్రత్తగా పకడ్బందీగా డైలాగ్స్ రాయటం వలనేమో అలాంటి సమస్యలేమీ రాలేదీ సినిమాకి.
అయినా చిత్రం గురించి మాట్లాడుకునేటప్పుడ ఏదో ఒక దానితో పోల్చటం పరిపాటి. అలా దీన్ని కొందరు ప్రభాస్ మిర్చి సినిమాతో పోల్చి, అలాగే ఉంది కదా అన్నారు. అదేమిటి దానికీ దీనికీ పోలికెక్కడుంది అని అడిగితే, కథలో కాదు, మిగతా ఎందులోనూ కాదు కానీ అందులో ఇందులో కూడా ఉన్న కొందరు నటీనటుల వలనట.
ప్రభాస్ కి తల్లిగా మిర్చి సినిమాలో కనిపించిన నాదియా ఇందులో పవన్ కళ్యాణ్ కి అత్తగానూ, సమంత ప్రణీతలకు తల్లిగానూ నటించింది. హంసా నందిని మిర్చి లో టైటిల్ సాంగ్ లో మెరిసింది. అలాగే అత్తారింటికి దారేది లో ఒక ప్రత్యేకంగా చూపించిన పాటలో మెరుపులా మెరిసింది. అందువలన అత్తారింటికి దారేది సినిమా మిర్చి పంథాలో పోయిందట!
ఇంకా నయం, అందులో ఇందులో కూడా చివర 'శుభం' అని ఉంది కాబట్టి దాని కాపీ అని అనలేదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more