భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు తెలుగు దేశం పార్టీ తో భాజపా ఎన్నికల పొత్తు విషయంలో మీడియా ప్రతినిధులు మాట్లాడగా, ఆయన ఆ విషయాన్నిఖండించారు. అంతకు ముందు ప్రకటించినట్లుగానే 42 పార్లమెంటు నియోజకవర్గాలలోను, 294 శాసనసభ నియోజక వర్గాలలోనూ భాజపా తనంతట తానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మకాం వేసి జాతీయ స్థాయిలో సమీకరణలను చేస్తున్న సందర్భంగా వస్తున్న అనేక ఊహాగానాలకు కళ్ళెం వేస్తూ వెంకయ్య నాయుడు పై విధంగా తెలియజేసారు.
రాష్ట్ర నాయకులు కొందరు సీమాంధ్ర ప్రజల మనోభీష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని అంటున్నారు కదా అని అడగగా, పార్టీ ఉద్దేశ్యం కూడా అదేనని, తెలంగాణా మీద ఒక నిర్ణయానికి వచ్చే ముందు సీమాంధ్ర ప్రజల ఉద్దేశ్యాలకు గౌరవం ఇవ్వటం ముఖ్యమేనని, అయితే తెలంగాణా విషయం లో పార్టీ వెనక్కి తగ్గేది లేదని, ఆ విషయంలో పార్టీ కమిట్ మెంట్ లో మార్పు ఉండబోదని వెంకయ్య నాయుడు స్పష్టం చేసారు.
అటు తెలుగుదేశం పార్టీ అధినేత కూడా భాజపాతో పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థతుల్లో నరేంద్ర మోదీ మంత్రాన్ని అందరూ జపిస్తూనేవున్నా, లోగడ గుజరాత్ లో 2002లో జరిగిన అల్లర్ల దృష్ట్యా అప్పట్లోనే మోదీని తొలగించవలసిందిగా కోరిన చంద్రబాబు, పార్టీలో చాలామంది మోదీకి అనుకూలంగా సమర్ధన తెలియజేసినా, ఆ విషయంలో నిశ్చిత అభిప్రాయానికి ఇంకా రాలేకపోతున్నారు.
పొత్తులు ఎప్పుడూ అవసరాలను బట్టే ఉంటాయి. పార్టీ పటిష్టంగా ఉందనే భావన కలిగిన సందర్భంలో ఎవరూ ఇతర పార్టీలతో పొత్తు గురించి ఆలోచించరు. ఇప్పడు భాజపా విషయంలో కూడా అలాగే జరుగుతోంది. నరేంద్ర మోదీ మీద పెరుగుతున్న మోజు మీదనే ఆధారపడి ఉన్న భాజపా మోదీ ప్రసంగాలకు వస్తున్న స్పందన చూసిన తర్వాత మరే పార్టీ అవసరమూ తమకు లేదని భావిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more