Upa plans to give mobiles tablets pcs to poor

Centre plans to give mobiles, tablets, PCs to poor, mobile phone,tablet pc,election time, general elections , PCs to 90-lakh students, government schools

With the next general elections close at hand, the UPA government mooted a proposal to give free mobile handsets to each family in villages.

పేదలకు కేంద్రం ఎన్నికల ఎర

Posted: 09/07/2013 09:35 AM IST
Upa plans to give mobiles tablets pcs to poor

ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు మళ్ళీ అధికారంలోకి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించి బుట్టలో వేసుకుంటాయి. ముఖ్యంగా పేద ప్రజలను, గ్రామాల్లో ఉన్న వారిని ఆకర్షించేందుకు ఎంతైనా సిద్ధపడతాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో టీవీలు, లాప్ టాప్ లు  లాంటివి ఇస్తుంటే ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఉన్న వారికి సెల్ ఫోన్లు, 11, 12 తరగతులు చదువుతున్న వారికి పీసీ ట్యాబ్ లు ఇచ్చేందుకు ఓ పథకాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించుతుంది. ఇప్పటికే పట్టుబట్టి ఆహారభద్రత బిల్లును ప్రవేశపెట్టి తన పంతం నెగ్గించుకున్న యూపీఏ ఇప్పుడు పేదలను, గ్రామాల్లో ఉన్న ప్రజలను, యువతకు గాలం వేస్తుంది. వచ్చే ఎన్నికల కంటే ముందే ఈ విధాన్ని ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ మేరకు టెలికామ్ విభాగంలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థయిన టెలికామ్ కమిషన్‌కు ఒక నోట్‌ను  పంపింది. ఇది టెలికామ్ కమిషన్ ఆమోదం పొందితే కేబినెట్‌కు వెళ్తుంది. అక్కడ ఆమోదిస్తే... 2014 మార్చి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

ఈ పథకం అమల్లోకి వస్తే  గ్రామాల్లో నివసిస్తున్న 2.5 కోట్ల మందికి మొబైల్ ఫోన్లను, ప్రభుత్వ స్కూళ్లలో 11, 12 తరగతులు చదువుతున్న 90 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లెట్ పీసీలను అందివ్వనుంది. ఈ పథకం కోసం 10 వేల కోట్లను ఖర్చు చేసేందుకు కూడా ప్రణాళికను రూపొందించారు. మొబైల్ ఫోన్లకు రెండేళ్ళ పాటు రీఛార్జ్ లు, ట్యాబ్లెట్ పీసీలో సిమ్, 500 ఎంబీ వరకు ఇంటర్ నెట్, రూ. 75 టాక్ టైమ్, 75 ఎస్సెమ్మెస్ లు, ఉచితంగా అందజేస్తారు. పథకాన్ని మొదలు పెట్టేది 2014 మార్చిలోనే అయి నా... ఫోన్ల కేటాయింపు పూర్తి చేయడానికి మాత్రం ఆరేళ్లు పడుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.4,850 కోట్ల భారం పడుతుందని సమాచారం. ఈ ఎన్నికల తాయిలాలు యూపీఏకు ఉన్న మచ్చల్ని తొలగించి అధికారాన్ని కట్టబెడతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more