Mamata banerjee rules out division is not stop venkaiah naidu

mamata banerjee rules, division is not stop venkaiah naidu, mamata banerjee, bjp senior leadervenkaiah naidu,

mamata banerjee rules out division is not stop venkaiah naidu

విభజన జరగదు: మమత- నమ్మవద్దు: వెంకయ్యనాయుడు

Posted: 08/29/2013 08:50 PM IST
Mamata banerjee rules out division is not stop venkaiah naidu

విభజన జరగదు.. విభజన జరగదు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఫైర్ బ్రాండ్ పేరు మమతా విభజన జరగదని గట్టిగా అంటున్నారు. మీడియా ముందు నిప్పులు చెరిగే మమతా ఈ సారి చాలా కూల్ గా విభజన జరగదని చెప్పటం చాలా విశేషంగా ఉంది. అంటే.. ఆంద్రప్రదేశ్ జరుగుతున్న తెలంగాణ విభజన ప్రక్రియ కాదులేండి. డార్జిలింగ్ కొండల్లో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ ను ఉపసంహరించుకోవాలని గుర్కా జనముక్తి మోర్చా(జీజేఎం)ను మరోసారి కోరారు. జీటీఏకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ను ఎన్నుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జీజేఎంకు అన్నివిధాలా సహకరిస్తామని మమత హామీయిచ్చారు. జీటీఏకు ద్వారా భూములు పంపిణీ చేశామని, వైద్యం- విద్య అందించామని, వంద రోజుల ఉపాధి కల్పన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గుర్కాలాండ్ పేరు మీదే ఇవన్నీ చేస్తున్నామని ఇంకా ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. రాష్టం విడిపోయే పరిస్థితి లేదని మమత బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ పేరుతో డార్జిలింగ్ లో అభివృద్ధి కార్యక్రమాలను జీజేఎం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. రోగులను తరలిస్తున్న వాహనాలకు కూడా నిప్పు పెడుతున్నారని ఆమె విమర్శించారు.

 

నమ్మవద్దు: వెంకయ్యనాయుడు

విభజన జరగదని అంటే మీకు నమ్మకండి అని బీజేపి సీనియర్ వెంకయ్యనాయుడు అంటున్నారు. ఇక్కడ మాత్రం వెంకయ్యనాయుడు మాట్లాడుతుంది ఆంద్రప్రదేశ్ రాజకీయ గురించే మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బీజేపీ సూత్రపాయంగా నిర్ణయం తీసుకుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణపై తన నిర్ణయం మార్చుకోదని తన అభిప్రాయంగా చెప్పారు. రాష్ట్ర విభజన ఆగుతుందని ఎవరైనా చెప్తే నమ్మవద్దని సీమాంధ్ర ఉద్యోగులకు చెప్పినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు సందర్భంగా సీమాంధ్రుల ఆందోళపై చర్చిస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి మొదటి నుంచి మద్దతు తెలుపుతోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా తాము మద్దతు తెలుపుతామని వారు చెబుతూనే ఉన్నారు. అసలు ఇంతకీ వెంకయ్యనాయుడు సమైక్యవాదా.. లేక తెలంగాణవాదా అనే విషయం ఎవ్వరికి అర్థం కావటంలేదు.. ఈ విషయన్ని నెల్లూరు ప్రజలే తేల్చాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more