Chandra babu letter to manmohan singh

Chandra Babu letter to Manmohan Singh, Telugu Desam Party, CWC, Prime Minsiter, Congress party, APNGOs, Antony Committee

Chandra Babu letter to Manmohan Singh

ప్రధానిపై ధ్వజమెత్తిన చంద్రబాబు

Posted: 08/29/2013 10:08 AM IST
Chandra babu letter to manmohan singh

సీమాంధ్రలో జనమంతా రోడ్ల మీదకు వచ్చి నాలుగు వారాలుగా జనజీవనం స్థంబించిపోతుంటే కూడా మౌనం వీడరా తమరు? అంటూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి లేఖాస్త్రాన్ని సంధించారు.  అన్ని విషయాల్లో మౌనాన్ని పాటించటం సరికాదని చెప్తూ, ఈ సందర్భంలో అది బాధ్యతలను విస్మరించి పలాయన మంత్రం పఠించటమేనంటూ చంద్రబాబు విమర్శించారు. 

రెండు సార్లు గెలిపించి మీకు గద్దెను కట్టబెట్టింది ఇందుకేనా?  తెలుగువారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతారా! పైగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో దిగ్విజయ్ సింగ్ ఒక పక్కనుంచి వైషమ్యాలను ఎగదోస్తున్నారు!  ఉద్యోగుల మధ్య విభేదాలు వచ్చాయి.  2009 లో ప్రకటన తర్వాత తెలంగాణా ప్రాంతంలోను, ఇప్పడు సిడబ్లుసి ప్రకటనతో సీమాంధ్రలోను రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు.  ఇదేనా రాష్ట్ర ప్రజలకు మీరు చేసే నిర్వాకం అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.

మా బాధలు చెప్పుకోవటానికి మేము ఢిల్లీ రావలసి వస్తోంది.  కానీ మీరు మాత్రం పట్టించుకోరు.  ఎపిఎన్జీవో నేతలు మిమ్మల్ని కలుస్తే మీరు వాళ్ళని ఆంటోనీ కమిటీకి పొమ్మంటారా!  అంటే ఇది పార్టీ అంతర్గత వ్యవహారమా?  ప్రజల సమస్య ప్రభుత్వ సమస్య కాదా?

ఇప్పటికైనా పార్టీ పక్షపాతాన్ని అధిగమించి కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగం కాకుండా ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన మీరు ప్రధాన మంత్రిగా తీసుకోవలసిన చర్యలు తీసుకోండి అని చంద్రబాబు ప్రధాన మంత్రిని కోరారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more