ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆందోళనలు చేస్తారు కాబట్టి ఒకదానితో మరొకదాన్ని పోల్చటం నిజానికి సరికాదు. కానీ రెండూ ఈ రాష్ట్రంలోనే జరిగినవి, ఈ మధ్యకాలంలోనే జరుగుతున్నవి కాబట్టి, కొందరు వాటిని పోల్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం తెలంగాణా ప్రాంత ప్రజలు చేసిన ఉద్యమానికి, రాష్ట్రాన్ని విభజించ వద్దని, సమైక్యంగానే ఉంచాలని కోరుతూ సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమానికి మధ్యనున్న కొన్ని తేడాలలో రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడేవాటిని పక్కన పెడితే, మిగిలినవి ఇలా-
తెలంగాణా విభజన కోరుకుంది, సమైక్యం దానికి వ్యతిరేకంగా రాష్ట్రం కలిసివుండాలని కోరుకుంటోందన్నదే కాక వాటి మధ్య నున్న మరికొన్ని తేడాలను రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.
టివి ఛానెళ్ళు నిర్వహించే చర్చల్లో ఫోన్ ద్వారా పాల్గొనే ఒక కార్యక్రమంలో, నిరుద్యోగులైన కొందరు రాజకీయ నాయకులకు తెలంగాణా ఉద్యమం ఉపాధి కల్పిస్తే, సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ నాయకులు నిరుద్యోగులయ్యారని వ్యాఖ్యానం చేసారు.
రాజకీయ నాయకులు తెలంగాణాలో ఉద్యమాన్ని నడిపిస్తే, సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారని, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు పరుగులు తీసేట్టు చేసారని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాగిస్తున్న నేతలు అంటున్నారు. ఒక్క విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమే కాదు సీమాంధ్ర లోని వివిధ సంఘాలు వాళ్ళూ వీళ్ళూ అని లేకుండా అందరూ వారి వారి పనులను, విధులను బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి ఆందోళన తెలియజేస్తున్నారని అన్నారు.
జై తెలంగాణా అనటంలో కేవలం తెలంగాణా ప్రజల సంక్షేమమే కోరుకున్నారని, సమైక్యాంధ్ర నినాదంలో రాష్టం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకోవటం వలన తెలంగాణా కూడా అందులో భాగమైవుందని కొందరన్నారు.
తెలంగాణా కోసం ఆందోళనలు తెలంగాణా అంతా జరగటమే కాక హైద్రాబాద్ లోనూ జరిగాయని, దానితో సీమాంధ్రులకు ఇబ్బందులు కలిగాయని, కానీ సమైక్యాంధ్ర పరిధి రాష్ట్రమంతా ఉన్నా, కేవలం సీమాంధ్రలోనే ఉద్యమం జరుగుతోంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్రానికి రాజధానియైన హైద్రాబాద్ లో ఎల్ బి స్టేడియంలో సెప్టెంబర్ 7 న తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు అనుమతి లభించకపోవటం మీద ఎపిఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు నిన్న విశాఖ పట్నంలో జరిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో మండిపడ్డారు.
ఇక పోలికలు కూడా ఉన్నాయి. తెలంగాణా ఉద్యమంలో జరిగినట్లే ర్యాలీలు, ఉద్యోగుల సహాయ నిరాకరణ, సమ్మెలు, వంటా వార్పులు, రైల్ రోకోలు, డ్యాన్సలు పాటల లాంటి సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, కేవలం వాటిని కాపీ పేస్ట్ చేస్తున్నారని కొందరు విమర్శించారు. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆందోళన అంటే చేసేవి అవే. రెండవది, ఆచార వ్యవహారాల్లో తేడాలున్నా మౌలికంగా అందరూ తెలుగు వాళ్ళే కావటం మరో కారణం.
ప్రస్తుతం ఇరువైపుల వాళ్ళూ ముఖ్యంగా పాటించవలసింది సంయమనమని, రెచ్చగొట్టే వ్యాఖ్యలను చెయ్యవద్దని సీనియర్లు వారిస్తున్నారు. మీడియా కూడా ఈ పరిస్థితుల్లో ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more