నిక్షేపంలా బ్రతికున్న కనక చనిపోయిందనే వార్తను ఒక మీడియా వెబ్ సైట్ ఘనంగా ప్రచురించింది. అది చూసిన కనక మహాలక్ష్మి మీడియా ముందుకొచ్చి బాబూ నేనింకా బ్రతికే ఉన్నా అని చెప్పుకోవలసివచ్చింది. అంతేనా ఆమెకు లేని క్యాన్సర్ వ్యాధిని కూడా అంటగట్టారు.
ఇంతకీ ఎవరా కనక మహాలక్ష్మి అని అనుకుంటున్నారా. అలనాటి మేటి నటి దేవిక కూతురు. రాజేంద్ర ప్రసాద్ తో కనక వాలు జడ తోలు బెల్ట్ సినిమాలో నటించింది. తమిళం మళయాళాల్లో అగ్ర హీరోలతో నటించింది.
కనక కేరళలో అలెప్పీ లో రహస్యంగా క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ వస్తోందని నిన్న ఆమె అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిందని కూడా మీడియా ప్రచురించింది. 2004 నుంచి సినిమా పరిశ్రమకి దూరంగా ఉందని, ప్రేమ వివాహం చేసుకున్న కనక భర్త వ్యాపారంలో నష్టపోయి అదృశ్యమయిందని కూడా ప్రచారం జరిగింది.
నేను ఇంకా పోలేదు. నిక్షేపంలా ఉన్నా. నాకు ఎటువంటి క్యాన్సర్ లేదు. నేను ఆఖరి సారిగా కేరళ వెళ్ళింది 1992లో, అది కూడా ఒక సినిమా షూటింగ్ నిమిత్తం. నేను కొన్ని కారణాల వలన సినిమా పరిశ్రమకి దూరంగా ఉన్నాను. నాకు సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయి. త్వరలో మీ ముందుకి వస్తాను అని చెప్పింది కనక.
కనక మహాలక్ష్మి మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. నేను ఇదంతా కావాలని పబ్లిసిటీ కోసం చేసాననుకుంటున్నారేమో. ఎవరూ పబ్లిసిటీ కోసం చనిపోయినట్టుగా వార్తలకు ఎక్కరు అని కనక తెలియజేసింది.
ఇన్ని రకాల తప్పుల తడికలల్లిన ఆయా మీడియాలు వార్తల సెన్సేషన్ కోసం ఇంకా ఎందరి మీద ఎన్ని రకాల వార్తలను ప్రచురిస్తున్నారో. ఎంత వరకు నమ్మాలో. నాన్నా పులి అన్న చందాన పూర్తిగా వార్తలను కొట్టి పారేసే స్థితికి వచ్చినా రావొచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more