Congress not clear still on telangana

Congress not clear still on Telangana, Congress core committee, Digvijay Singh, Sonia Gandhi, Kiran Kumar Reddy, Botsa Sayanarayana, Damodara Raja Narasimha

Congress not clear still on Telangana

రాష్ట్రవిభజన మీద స్పష్టమైన అస్పష్టత

Posted: 07/27/2013 10:41 AM IST
Congress not clear still on telangana

రాష్ట్ర విభజన మీద ఏమాత్రం స్పష్టత రాలేదన్న విషయం నిన్న కోర్ కమిటీ సమావేశం తర్వాత దిగ్విజయ్ సింగ్ మాటల్లో అర్థమౌతోంది. 

రాష్ట్ర ప్రతినిధుల ఉద్దేశ్యాలను కోర్ కమిటీ పరిశీలించటం జరిగింది, ఇక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటమే మిగిలింది అని దిగ్విజయ్ చేసిన ప్రకటన వలన ఏ విషయమూ స్పష్టంగా లేకపోగా ఎవరి నమ్మకాలను వారు నమ్ముతూ రాజకీయ నాయకులు తమ తమ ప్రకటనలను చేస్తున్నారే తప్ప ఎవరికీ ఏ మాత్రం స్పష్టతా ఈ విషయంలో లేదన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. 

రాష్ట్రం నుంచి మరోసారి ముగ్గురు నాయకులు వెళ్ళటమైతే జరిగింది కానీ వాళ్ళు కోర్ కమిటీ లో కాకుండా విడిగా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడటం కోసం మాత్రమే పిలిపించారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయినప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యకపోతేనే కాంగ్రెస్ మనుగడ ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసారు.  ఆ తర్వాత సోనియా గాంధీతో కూడా రాష్ట్రంలోని రాజకీయ అంశాలను, రాష్ట్ర విభజన జరిగితే వచ్చే కష్టనష్టాలను ఆయన వివరించారు.  నాయకుల మూకుమ్మడి రాజీనామాల విషయంలో కూడా చర్చించుకున్నట్లుగా సమాచారం.

పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా రాష్ట్రవిభజన వలన పార్టీకి నష్టమనే అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.  ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మాత్రం తెలంగాణా రాష్ట్ర అవతరణ చాలా అవసరమన్న విషయాన్ని దిగ్విజయ్ సింగ్ తో రెండు గంటల సేపు చర్చించారు.  మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణా ఈ సారి వచ్చి తీరుతుందన్న ధీమాను వ్యక్తంచేసారు. 

సీమాంధ్ర మంత్రులు విభజన జరగదనే ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చుతూనే అలా జరగనివ్వవద్దని సోనియాగాంధీకి లేఖ రాసారు.

ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తున్నది ఒక్కటే- కాంగ్రెస్ పార్టీకే స్పష్టత ఇంకా రాలేదని. 

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more