మనిషి రోజు రోజుకు కొత్తగా ఆలోచించి కొత్త కొత్త వాటిని కనుక్కోవడంలో విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. అదే సమయంలో ఏ ఒక్క దాన్ని కూడా వ్రుధా చేయకుండా ఉపయోగపడేలా చేయడంలో పై చేయి సాధిస్తున్నాడు. ఈ సాంకేతిక పరిజ్ణాన మరో ప్రయోగంలో మరో ముందడుగు వేశాడు. ప్రస్తుతం నిత్యజీవితంలో భాగం అయిన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎంతో బాధపడతాం. ఇక నుండి ఆ చింత అవసరం లేదు. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన టైంలో కాస్తంత మూత్రం పోస్తే చాలు మీ సెల్ ఛార్జింగ్ అయినట్లే. మూత్రంతో చార్జ్ అయ్యే సెల్‌ఫోన్ ను బ్రిటన్‌లోని ‘బ్రిస్టల్ రోబోటిక్స్ లేబొరేటరీ ’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు మరి. ఇందుకుగాను వారు మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్స్ (ఎంఎఫ్‌సీ)తో కూడిన ఓ చార్జింగ్ పరికరాన్ని తయారుచేశారు. ఈ పరికరం సహాయంతో సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. ఎంఎఫ్‌సీ పరికరాలు సూక్ష్మజీవుల రసాయన చర్యల ఆధారంగా ఎనర్జీ కన్వర్టర్లుగా పనిచేస్తాయి. ఎంఎఫ్‌సీల్లో ఉండే సూక్ష్మజీవులు తమ జీవక్రియల ద్వారా కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేసి నేరుగా విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తాయి. మూత్రంలోని కర్బన పదార్థాలను సూక్ష్మజీవులు తిని జీవక్రియలు జరుపుకొంటాయి. ఈ క్రమంలో స్వల్పమొత్తంలో విద్యుత్ ఉత్పన్నంగా విడుదలవుతుంది. దీంతో సెల్ ఛార్జింగ్ అవుతుంది. అయితే.. ప్రస్తుతం ఈ పద్ధతిలో స్వల్పమొత్తంలో మాత్రమే చార్జ్ చేసుకోవచ్చట. భవిష్యత్తులో ఇది బాగా వాడకంలోకి వస్తుందని, రానున్న రోజుల్లో సెల్‌ఫోన్ పూర్తిగా చార్జ్ అయ్యేందుకు ఉపయోగపడేలా దీనిని అభివృద్ధిపరుస్తామని పరిశోధకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more