కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రకటన చేస్తాం, ఇక రోడ్ మ్యాప్ రెఢీ చెయ్యండని, రాష్ట్రం ముఖ్యమంత్రి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అప్పగించారు.ఈముగ్గురు రోడ్మ్యాఫ్ పై కుస్తీలు పడుతున్నారు. అయితే ముందుగా పీసీసీ ఛీఫ్ బొత్స సత్యానారాయణ కాంగ్రెస్ హైకమాండ్ కు రోడ్ మ్యాప్ అందించినట్లు సమాచారం. ఇంక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ రోడ్ మ్యాప్ పై కసరత్తూ చేస్తున్నారు. ఏ ప్రాంతం నాయకులు ఆ ప్రాంతం పెద్ద పై ఒత్తిడి పెంచుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అలాగే సమైక్యాంద్ర నాయకులు కూడా సీఎంను కలిసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి సమయంలో.. రోడ్ మ్యాప్ అవసరం లేదు? అని కాంగ్రెస పార్టీ నాయకుడు చెప్పటం జరిగింది. తెలంగాణపై అధిష్టానం రోడ్ మ్యాప్ అనవసరం అని ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. రాజీనామాల పేరిట కొందరు నేతలు హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలం వ్యతిరేకం అని చెప్పారు. మద్రాస్ టు కర్నూలు, కర్నూలు టు హైదరాబాద్ కు రాజధాని సహా తామూ మారాం అని, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే రాయల తెలంగాణ, ఉత్తరాంధ్ర, నెల్లూరు కూడా ఒక రాష్ట్రం కావాలనే డిమాండ్ లు తలెత్తుతాయన్నారు. హైదరాబాద్, తెలంగాణలో రాష్ట్ర విభజనపై రెఫరెండం నిర్వహించాలని ఆయన కోరారు. రెఫరెండానికి తాము కట్టుబడి ఉంటామని వివేకానందరెడ్డి చెప్పారు. వివేకానంద రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అయిన రోడ్ మ్యాప్ ఇచ్చినంతమాత్రనా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more