Law minister erasu pratap reddy power cut in district collector

law minister erasu pratap reddy, power plant, district collector, Vempenta village, Mini Power Plant , Vempenta Village , Erasu Pratap Reddy

law minister erasu pratap reddy power cut in district collector

మంత్రి ఏరాసు పవర్‌ కు కలెక్టర్‌ బ్రేకే

Posted: 07/04/2013 10:15 AM IST
Law minister erasu pratap reddy power cut in district collector

రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పవర్ కు కర్నూల్ జిల్లా కలెక్టర్ బ్రేక్ వేశారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పవర్ వలన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన పవర్ కు జిల్లాకలెక్టర్ సుదర్శన్ రెడ్డి బ్రేక్ వేశారు. ఏరాసు ప్రతాప్‌రెడ్డికి చెందిన ర్యాంకో పవర్‌ప్లాంటు పనులను నిలిపివేయాల్సిందిగా కర్నూల్ జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వేంపెంట గ్రామంలో మంత్రికి చెందిన పవర్‌ప్లాంటు పనులను నిలిపివేయాల్సిందిగా గ్రామస్తులు పలు దఫాలుగా ఆందోళనలు నిర్వహించి గతంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, జేసీ కన్నబాబు, ఆర్‌డీఓ కుర్మానాథ్‌ వేంపెంట లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పచ్చటి పొలాల మధ్య పవర్‌ ప్లాంట్‌ నిర్మిస్తే తమ బతుకులు ఏంకావాలని నిలదీశారు. పచ్చగా ఉన్న గ్రామం శ్మశానంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అవేంపెంట గ్రామం నిప్పుల వాగుకు సగం అటువైపు..సగం ఇటువైపుగా ఉందని తెలిపారు. ఈ నిప్పులవాగు నీటితోనే తమ తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయని తెలిపారు. అయితే తెలుగు గంగ ఎస్కేప్‌ ఛానల్‌ నుంచి నీరు నిప్పుల వాగుకు వస్తుందని, ఆ నీటితోనే పవర్‌ ప్లాంట్‌ నిర్మించి విద్యుత్‌ ఉత్పాదన చేయవచ్చన్న ఆలోచనతోనే న్యాయశాఖ మంత్రి రూ.45 కోట్లతో 7.3 కిలో వాట్స్‌ ఉత్పాదనను ఉత్పత్తి చేసేందుకు పవర్‌ ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభించారని పచ్చటి గ్రామం శ్మశానం కావాలా? అని ప్రశ్నించారు. తామంతా వేంపెంటను ఖాళీచేసి వెళ్ళిపోతామని గ్రామప్రజలు ముక్తకంఠంతో జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకు న్నారు. అయినా ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పనులు చేపట్టరాదని, నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు కోరారు.

గ్రామస్తుల ఆవేదన అర్థం చేసుకున్న కలెక్టర్‌ పవర్‌ప్లాంటుపై థర్డ్‌ పార్టీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటావన్నారు. కారులో బయలుదేరిన కలెక్టర్‌కు గ్రామ ప్రజలు రోడ్డుపై అడ్డంగా బైఠాయించి పవర్‌ప్లాంటు పనులు నిలిపివేస్తారా? లేక తాము గ్రామం వదిలి వెళ్లాలా అంటూ నినాదాలు చేయడంతో జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి పవర్‌ ప్లాంటు పనులు నిలిపివేయమంటూ కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రజలు ముక్తకంఠంతో కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more