చాలా కాలంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయంలో వ్యాఖ్యానాలు చెయ్యని పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మంగళవారం ఆ దిశగా మాట్లాడారు. త్వరలో కేంద్రం ఈ విషయంలో భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వెయ్యబోతున్నదని, ఒక వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా రాష్ట్రం విడిపోయినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు.
అంటే రాష్ట్రం విడిపోవటం జరగదని అర్థం చేసుకోవచ్చు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంలో లగడపాటి సర్వేలు, అంచనాలు నిజమయ్యాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంచనాలు మాత్రం కాంగ్రెస్ కి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయన్న సమాచారం అందినప్పుడు ఆయన దాన్నే ప్రకటించారు కానీ ఇతర కాంగ్రెస్ నాయకుల లాగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అనలేదు.
ఇప్పుడు కూడా తెలంగాణా విషయంలో ఆయన చెప్తున్నది నిజమే అయినట్లయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర విభజన మీద ప్రతిపాదన పెట్టమని కోరవచ్చు. రాష్ట్ర విభజన విషయంలో సర్వసమ్మతి లభించలేదు కాబట్టి మరోసారి రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదన పెట్టి పోలింగ్ లో వచ్చిన ఓట్లను బట్టి పార్లమెంటులో ప్రతిపాదన పెడతామని అనే అవకాశం ఉంది. అదేగనక జరిగితే తెలంగాణా విషయంలో పార్టీల ముసుగులో గుద్దులాటలన్నిటికీ చెక్ పడుతుంది.
తెలుగుదేశం పార్టీ లోగడ తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవలసిందిగా లగడపాటి కోరారు. అలాగే ఇతర నాయకులను కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా ఓటు వెయ్యమని కూడా ఆయన కోరారు. అదే జరిగిన పక్షంలో తెలంగాణాలో ప్రాంతంలో ఆయా పార్టీల మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది.
ఒకే దెబ్బకు అనేక పిట్టలు. ఇటు తెలంగాణా విషయంలో రాష్ట్రం నుంచి ఒత్తిడి రాకుండా ఉంటుంది, అటు ప్రతిపక్షాలన్నీ ఇరుకునపడతాయి.
భాజపా అప్పుడే రెండు వైపులా నరుక్కొచ్చే ప్రయత్నంలో భాగంగా తిరుపతి నుంచి ఆంధ్రా ప్రాంతాలలో కూడా ప్రచారం మొదలుపెట్టి, తెలంగాణా తెచ్చేది మేమే అంటూ తెలంగాణా ప్రాంత ప్రజల సద్భావన కోసం చేసిన ప్రకటనల వలన ఆంధ్రాప్రాంతంలో పార్టీకి నష్టం కలుగకుండా ఉండే ప్రయత్నం చేస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more