ఉత్తరాఖండ్ లో తెలుగు ప్రజలు పడుతున్న బాధలు అందరి హ్రుదయాలను కరిగిస్తుంది. కానీ ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నారు. కానీ మనిషి అనుకుంటే ఏదైన సాధించి తీరుతాడు అని నిరూపించి, తెలుగువారికి ‘‘మీకు అండగా నేనున్నా ’’ అంటూ ఒక రాజకీయ నాయకుడు నడుంబిగించి సహాయ చర్యల్లో దగ్గురుండి తెలుగువారికి అభయహస్తం ఇచ్చి, తెలుగువారిని క్షేమంగా సొంత రాష్ట్రానికి చేర్చే పనిలో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాజకీయలను పక్కన పెట్టి, తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం నుండి ఉత్తరాఖండ్ కు వెళ్లిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయకుడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రభుత్వం, ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులను పట్టించుకోలేదు. అన్నీ రాష్ట్రాలు తమ ప్రజల కోసం సహాయ చర్యలు వేగవంతంగా కొనసాగిస్తుంటే.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వెనబడిపోయింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ద్వారా ఉత్తరాఖండ్ సీఎం తో మాట్లాడినట్లు కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు ప్రకటనలు గుప్పిస్తున్నారు.
కానీ తెలుగుప్రజల కోసం స్వయంగా రంగంలోకి దిగి సహయ చర్యలు చేయటంలో కిరణ్ సర్కార్ వెనబడిపోయింది. ఉత్తరాఖండ్ లో తెలుగు యాత్రికులకు ఆర్మీ చిన్నచూపు చూస్తూ, బాషపరంగా సహాయ చర్యల అందించటంతో .. తెలుగు వారి పరిస్థితి దారుణంగా ఉన్నట్లు మీడియా వర్గాలు అంటున్నారు. తెలుగు వారి బాధలను మీడియా ద్వారా తెలుసుకున్న చంద్రబాబు , అమెరికా నుండి తిరిగి వచ్చి, వెంటనే ఢిల్లీ భవన్ చేరుకొని తెలుగు ప్రజల బాధపంచుకున్నారు. వెంటనే టిడిపి శ్రేణులను రంగంలోకి దించి తెలుగు ప్రజలకు సహాయచర్యలు అందించాలని బాబు పిలుపు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు పిలుపుతో టిడిపి శ్రేణులు రంగంలోకి దిగి, తెలుగు వారికి సహయ చర్యలు ముమ్మరం చేశాయి. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి.. కొంతమంది ఎంపీలతో కలిసి ఉత్తరాఖండ్ బయలుదేరి వెళ్లి, స్వయంగా తెలుగువారికి సహయం అందిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు తెలుగు వారి పై వ్యవరించిన తీరు చంద్రబాబు చలించిపోయారు. మీకు అండగా నేనున్నా అంటూ.. తెలుగు యాత్రికు ఆపన్నహస్తం అందించారు. తెలుగువారి పట్లు విచక్షణ చూపుతున్న వైఖరిని ఉత్తరాఖండ్ సీఎంతోచర్చించి, బాబు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది.
నా తెలుగు ప్రజలను నేనే కాపాడుకుంటాను అంటూ.. తన సొంత ఖర్చులతో.. ఒక విమానం ఏర్పాటు చేసి, ఆ విమానంలో 193 తెలుగు ప్రజలను సురక్షితంగా హైదరాబాద్ చేర్చటం జరిగింది. హైదరాబాద్ విమానశ్రయంలో తెలుగు ప్రజల కోసం, నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ బాబు టిడిపి కార్యకర్తలతో కలిసి ఉత్తరాఖండ్ నుండి వచ్చిన తెలుగువారికి సహాయచర్యలు అందించటంలో నిమగ్నమైనారు. తెలుగు ప్రజల పట్ల బాబు చూపిన మానవత్వ ముందు రాజకీయ శత్రువులైన తలవంచి తీర్చాలిందే. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకున్నావాడే .. దేవుడుతో సమానం. ప్రజల బాధలను పంచుకున్నానాయకుడు నిజమైన రాజకీయ నాయకుడు. అక్కడ ఎక్కడో జరిగితే.. ఇక్కడ మనం ఏం చేస్తాం.. అంటూ చేతులు తిరగేసే నాయకులు సిగ్గు పడాలి. అధికారంలేని నాయకుడు తెలుగు ప్రజలకు కోసం ఇంత సాహాసం చేస్తే, అధికారంలో ఉండే కూడా .. ఉడతంత సహయం అందించకుండా మీడియా ముందు ప్రకటనాలు చేసే నాయకులు చంద్రబాబు ను చూసిన సిగ్గుతో తలదించుకోవాలని తెలుగు ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more