చూడటానికి అందంగా కనిపించే గులాబీ కింద ఒక ప్రమాధకరమైన ముళ్ళూ ఉంటుందనే విషయం ప్రతిఒక్కరి తెలుసు. ఆ గులాబీలో కనిపించే అందాన్ని ఆశ్వాదిస్తాం కానీ .. దాని వెనుక ఉన్న ముళ్ళూ గురించి ఎవరు ఆలోచించారు. వెండితెర పై కనిపించే గ్లామర్ గులాబీ భామలకు ఈ ముళ్ళూ గాయలు తగిలి అనేక మంది పలురకాలుగా తనువు చాలించారు. సినీ ప్రపంచంలో తమ గ్లామర్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన కొంత మంది తారలు.. కనుమరుగైనారు.
వెండి తెరపై ఒక్కసారి అనుభవం అయితే చాలు.. వారి జీవితం మొత్తం వెండితెరకే అంకితం చెయ్యాలి. వెండితెరకు అలవాటుపడిన గ్లామర్ గులాబీలు.. ఇతర రంగంలోకి అడుగు పెట్టే ఛాన్స్ చాలా తక్కువ గా ఉంటుంది. ఒక వేళ ఇతర రంగంలోకి అడుగు పెట్టిన, పాత జ్నాపకాలు వారిని కుదురుగా ఉండనీయన పరిస్థితి వస్తుంది. ఒక రెండు సినిమాల్లో తమ గ్లామర్ ఒలకపోసిన వారు .. తరువాత సినిమాల్లో అవకాశాలు రాక.. ప్రతి ఒక్కరు చులకన భావంతో చూడటం, కొన్ని హోదాలను కోల్పోవటంతో.. సదరు భామలు ఒత్తిడి తో నలిగిపోతారు.
అలాంటి సమయంలో వారి తీసుకునే నిర్ణయాలే.... వారిని కనిపించకుండ చేస్తాయి. ? అభిమానులు ఆదరణ, ఊహించని డబ్బు, సెలబ్రిటి హోదా ఇవన్నీ సినిమారంగంలో సహజం. అయితే ఇవి అవకాశాలు వరుసగా చేజిక్కించుకుంటున్న వారికి, విజయాలు దక్కించు కుంటున్నవారికి మాత్రమే చెందుతాయి. ఒకటీ రెండు చిత్రాల్లో నటించి గ్లామర్ జీవితానికి అలవాటుపడ్డాక, ఏ కారణం లేకుండానే కొత్త చిత్రాల్లో అవకాశాలు లేని తారలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో సెలబ్రిటీ హోదాకు దూరం అయిపోతున్న ఆవేదన వీరిలో కనిపిస్తుంది. సక్సెస్‌లు లేకుండా పలకరించేవారే ఉండరు. ఇలాంటి వాటిని తట్టుకోగలిగే సమర్ధత కొందరికే ఉంటుంది. మరికొందరు సినిమాలు లేకపోవడం తమ అసమర్ధతని చుట్టూ చేరినవారు చేసే కామెంట్స్ భరించలేకపోతారు.
ఈ క్రమంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇక సినీరంగంలో నిత్యం ప్రేమకథలు వినిపిస్తూనే ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండా దూరం కావడం వంటి సంఘటనలు ఆర్టిస్టులపై ఒత్తిడిని పెంచుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. గతంలో దివ్యభారతి, సిల్క్‌స్మిత, ప్రత్యూష, భార్గవి వంటి తారలు వివిధ కారణాల వల్ల తనువుచాలించారు. కొందరి ఆత్మహత్యలపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. మరి కొందరు సొంత కుటుంబం నుండే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తమను డబ్బు సంపాధించే యంత్రంగా తల్లిదండ్రులు భావిస్తున్నారని తారలు ఆరోపిస్తూ వస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి జియాఖాన్ కూడా ఈ కారణాల వల్లే తనువు చాలించిందని అంటున్నారు. నటి జియాఖాన్ ఆత్మహత్య గల కారణాలు ఏమిటో పూర్తిగా తెలియాదు. కానీ ఆ కారణాలు తెలుసుకొనే పనిలో ముంబయి పోలీసులు బిజీగా ఉన్నారు. జియాఖాన్ మరణం పై బయట అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలే విషయం ఏమిటనేది త్వరలో పోలీసులు బయటపెడతారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more