రాజకీయల్లో రేట్లు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు బంగారం, పెట్రోలు, కూరగాయలు , నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయానే తెలుసు. కానీ రాజకీయల్లో వస్తున్న పెను మార్పుల వలన .. రాజకీయల్లో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు. రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు, రాజకీయపార్టీలు, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటుకు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి.
ఎంపీ సీటు కావాలంటే ఒకరేటు, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఒక రేటు, అంటూ రాజకీయపార్టీలు తమ నోటీసు బోర్డులో రేట్ల పట్టికను అంటించుకున్నాయి. అయితే ఇక్కడ గెలిచే నాయకుల కోసమే ఈ నోటీసు బోర్డు రేట్లు అంటించారు. అంటే ఇంజనీర్ సీటు, మెడికల్ సీటు ఇంత రేటు అంటూ చెప్పే కాలేజీలను మనం విని ఉంటాం. మనకు ఆ రేటు నచ్చితే ఆయా కాలేజీలో చేరుతారు. అంటే నాలుగు సంవత్సరాలు ఆయా కాలజీల్లో విద్యార్థులు చదువుకోవాలి. కానీ సంపాదించలేరు? అదే రాజకీయల్లో అయితే ఒక్కసారి ఖర్చు పెడితే .. ఐదు సంవత్సరాలు సంపాదించుకోవచ్చు. అడిగే నాథుడే ఉండడు. కోట్లు సంపాదించుకోని.., పదవి నుండి దిగిపోవచ్చు అనే రాజకీయ ఆలోచన రాజకీయ నాయకుల్లో బాగా ఉందని రాజకీయ పార్టీలు అంటున్నాయి.
అందుకే ఎంత రేటు అయిన రాజకీయ సీటు కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి పదవికే రేటు ఫిక్స్ చేశారు. పార్లమెంట్ సీటు పదికోట్లు ఉంటే..? ఇక సీఎం సీటు రేటు ఎంతో ఉంటుందో ఆలోచించండి? అక్షరాల 100 కోట్లు ధర పలికింది. మార్కెట్లో ముఖ్యమంత్రి సీటు 100 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నడుగా కదా, మరీ అంటే.. కాంగ్రెస్ పార్టీకి అంతసీను లేదు, టీడీపీ లో రాబోయే ముఖ్యమంత్రి ఎవరో అనేది రాష్ట్ర ప్రజలకు ముందే తెలుసు. మొన్న కేసిఆర్ చెప్పిన పేర్లల్లో ఎవరో ఒకరు టిడిపి అధికారంలోకి వస్తే , వారే ముఖ్యమంత్రి అవుతారు. ఇక పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ మరణించినప్పటి నుండి , వైఎస్ జగన్ కన్ను ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న సంగతి తెలుసాయే.
ఇక ముఖ్యమంత్రి సీటు అమ్ముకోవాల్సిన అవసరం ఏ రాజకీయపార్టీ ఉందని అంటే.. ‘‘చిక్కిలు తినే చిన్నపిల్లాడును అడిగిన చెబుతాడు’’. కచ్చితంగా కేసిఆర్ తాతకే ఉందని చెబుతాడు. అవును నిజమే టీఆర్ఎస్ పార్టీకే ఉందని అంటున్నారు. టీఆఎస్ పార్టీ నినాదం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే, మొదటి ముఖ్యమంత్రి గా ఒక దళిత నాయకుడ్ని ముఖ్యమంత్రి గా చేస్తానని.. కేసిఆర్ తెలంగాణ ప్రజల ముందు బాసలు రాసుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 100 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎంపీ సీట్లు గెలుచుకోని , ప్రత్యే క తెలంగాణ తెస్తుందని .. కేసిఆర్ బహిరంగ సభల్లో మైకుల ద్వారా చెప్పటం జరిగింది. ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి సీటు ను అమ్మాకానికి పెట్టినట్లు సమాచారం. ఇప్పుటు టీఆర్ఎస్ పార్టీ దళితుల పార్టీ గా మారిపోయిందని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులు ఎక్కువుగా తెలంగాణ దళిత నాయకులే ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శ చింతాస్వామి అంటున్నారు.. అయితే కేసిఆర్ ముందు చూపుతో ఆలోచించి వచ్చే దళిత నాయకులకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీటు 100 కోట్లు అంటూ తెలంగాణ దళిత నాయకుల ముందు రేటు ఫిక్స్ చెసినట్లు చింతాస్వామి అంటున్నారు.. తెలంగాణ దళిత నాయకుల్లో ఎంపీ వివేక్ కేసిఆర్ బంఫర్ ఆఫర్ సిద్దమైనట్లు సమాచారం. ఎంపీ వివేకు కేసిఆర్ రూ. 100 కోట్లకు ముఖ్యమంత్రి సీటు అమ్ముకున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్రధాని కార్యదర్శ చింతా స్వామి ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసిఆర్ పక్కన పెట్టినట్లు ఆయన ఆరోపిస్తున్నారు . సీమాంధ్ర నేతలంతా ఏకమై తెలంగాణను అడ్డుకుంటున్నారన్న కేసిఆర్, ఏకమైన తెలంగాణ వాదులను ఎందుకు విచ్చిన్నం చేస్తున్నారో వెల్లడించాలని చింతాస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వాదనను పక్కన పెట్టి.. సీట్లు.. నోట్లు లక్ష్యంగా కేసిఆర్ కుటుంబం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ సీఎం సీటు అమ్ముకోవటం పై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. . ఇటు ఎమ్మెల్యే హరిశ్ రావు .. టీఆర్ఎస్ పార్టీ ని తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తానని ప్రకటనలు చెయడంతో పార్టీలోని నాయకులు అయోమయంలో పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more