Telangana news kcr new plan in trs party

kcr, harish rao, trs party, trs leaders, telangana issue, ktr, tdp, chandrababu naidu, lokesh babu, trs second place in ktr, harish rao vs kcr, trs leaders, siddipeta, 2014 election, kcr new plan in trs party,

kcr new plan in trs party

అతని దూకుడుకు కేసిఆర్ కళ్ళెం?

Posted: 05/28/2013 01:44 PM IST
Telangana news kcr new plan in trs party

నిన్నటి వరకు అతని మీద ఆధరపడిన కేసిఆర్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయాడు. తనలో మరో రూపాన్ని బయటకు తీశాడు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలోనే కేసిఆర్ నడుస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలను పార్టీలోకి ఆహ్వానించడం, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత కేకేను పార్టీలోకి తీసుకొచ్చే విషయమై పావులు కదపడం లాంటి వ్యూహాత్మక అడుగులు వేశారు.

అంతేకా కుండా తిరిగి తెలంగాణ అంశం మొత్తం తనవైపే తిపకునేలా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడడమే కాకుండా కాంగ్రెస్ బీసీ నేత పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీపై లేనిపోని మాటలు మాట్లాడి తిరిగి అంతా తనవైపు చూసేలా చేసుకున్నారు. ఇక రాష్ర్టంలోని ప్రధానాంశాలపై ఆయనే సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనే మాట్లాడుతున్నారు. శిక్షణ శిబిరాలకు సైతం క్రియాశీలకంగా పాల్గొంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అన్ని పార్టీలను మానసికంగా బలహీనం చేస్తూ.. నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌వైపు వచ్చేలా వ్యూహం పన్నుతున్నారు. ఏదైనా అంశాల్లో మాట్లాడాల్సి వస్తే.. ఒక్క హరీష్‌రావే కాకుండా పార్టీలోని అధికారిక ప్రతినిధులను, ముఖ్యనాయకులందరినీ ముందు పెడుతున్నారు.

ఈ విధంగా ఒకవైపు హరీష్‌రావుకు ప్రాధాన్యత తగ్గించి ఆయన దూకుడుకు కళ్ళెం వేస్తూనే మరోవైపు తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతూ పార్టీని తిరిగి పూర్తిగా తనవశం చేసుకుంటున్నాడు. రెండో స్థానంలో గతంలో ఉన్న హరీష్‌రావుకు బదులు తన కుటుంబం వారసత్వాన్నే దింపాలనే యోచనలో కేసీఆర్ నెమ్మదిగా పావులు కదుపుతున్నారు. చివరకు పార్టీ సంస్థాగత శిక్షణ శిబిరాల్లో సైతం ఎంతో చురుగ్గా పాల్గొనే హరీష్‌రావు ఈ సారి ఒకటి రెండు శిబిరాల తప్ప మిగతా వాటికి దూరంగా ఉన్నారు.

చివరకు హరీష్‌రావుకు గట్టిపట్టున్న సిద్ధిపేట అంసెంబ్లీ స్థానాన్ని సైతం కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అంటేనే కేసీఆర్, హరీష్‌రావు అనుకునే పరిస్థితి నుండి నెమ్మదిగా హరీష్‌రావు పార్టీలో అందరి నేతల మాదిరిగానే ఒక నాయకునిగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more