వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , కడప ఎంపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ కోసం, రాజకీయ పరంగా కాకుండా, ఒక భర్త కోసం పోరాటం చేసే భార్యగా వైఎస్ భారతి, ప్రజల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గృహణిగా, వ్యాపార లావాదేవీలను అజమాయిషీ చేసే వ్యక్తిగా, జగన్ సతీమణిగా అందరికీ పరిచయమైన వైఎస్ భారతి ఇటీవల సిబిఐ విషయంలో తరచూ వార్తల కెక్కుతున్నారు. ఇటీవలే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విడుదల కోసం వేసిన బెయిల్ పిటీషన్ అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎందుకు జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. చాలా అన్యాయం. మీకు పిల్లలు లేరా అంటూ జగన్ సతీమణి ఆరోజున కోర్టు హాలు వద్ద సిబిఐ ఉన్నతాధికారులను నిలదీశాలు. వారు ఓపిగ్గానే స్పందించారు. ఏమైనా చెప్పదల్చుకుంటే న్యాయస్థానానికి చెప్పుకోండి, మా వద్ద వాదనలు చేయవద్దు అని సిబిఐ అధికారులు అప్పట్లో భారతిని సున్నితంగా వారించారు. అంటే బెయిల్ అంశం న్యాయస్థానం పరిధిలోనిది అని తమ పరిధిలో లేదనే వాస్తవాన్ని వారు ఆమెకు వివరించారు. అయినా ఆమె మాత్రం తీరును మార్చుకోలేదు. బెయిల్‌పై కొండంత ఆశగా వున్న జగన్ కుటుంబానికి ఈనెల 9న నిరాశే మిగిలింది.
దేశంలో అగ్రశ్రేణి న్యాయవాదులతో బెయిల్ పిటీషన్‌పై వాదనలు వినిపించినా న్యాయస్థానం మాత్రం బెయిల్ మంజూరుకు నో చెప్పింది. మరో నాలుగు నెలల తర్వాత ట్రయల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసుకోవచ్చునని, జగన్ తరఫు న్యాయవాదికి సలహా ఇచ్చింది. దానితో మరో నాలుగు మాసాల పాటు అసలు పిటీషన్ దాఖలు చేయడానికే వీలులేని ఏర్పడింది. సెప్టెంబర్ రెండోవారంలో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే దాని ప్రాసెస్, నిర్ణయం ప్రకటించడానికి కనీసం ఒకటి రెండు నెలలు పడుతుంది. అక్కడ అనుకున్న నిర్ణయం రాకపోతే హైకోర్టును ఆశ్రయించాలి.
అక్కడా ప్రతికూల పరిస్థితి ఎదురైతే సుప్రీంను ఆశ్రయించాలి. ఈ తతంగం పూర్తికావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఈలోపల ఎన్నికలే పూర్తవుతాయి. ఎన్నికలకు అందుబాటులో జగన్ వుండరు, ఆయన బయట లేకపోతే పార్టీకి భవిష్యత్తు వుండదనే అసహనంతో కావచ్చు భారతి సిబిఐపై తన ప్రతాపాన్ని మరోసారి లేఖాస్త్రం ద్వారా చూపించారు. కేసు పూర్వాపరాలను ఉటంకిస్తూ, రాజకీయ పరమైన వత్తిళ్ళతోనే సిబిఐ పనిచేస్తోందని, బెయిల్‌కు అడ్డుపడుతోందంటూ సిబిఐపై ఆమె మండిపడ్డారు. ఆమె అనుమానాలను ప్రశ్నల రూపంలో సిబిఐకి పంపి సమాధానాలు కోరారు.
ఈ రకమైన ప్రశ్నావళి సంధించడంపై న్యాయనిపుణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిందితులు, వారి తరఫు కుటుంబ సభ్యులు ఏదైనా సమస్యవుంటే న్యాయస్థానంలో వాదనలు వినిపించుకుని, న్యాయపోరాటం కాని, దర్యాప్తు సంస్థకు లేనిపోనివి ఆపాదించి, మనోస్ధైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.
దేశంలో అగ్రశ్రేణి న్యాయ వాదులను ‘యంగేజ్ ’చేసినా, బెయిల్ రాని సంగతిని పరిశీలిస్తే ఆ కేసు ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చునని న్యాయవాదులు అంటున్నారు. 2004కు ముందు రెండంకెల కోట్లలో ఆస్తులున్న జగన్, ఆయన కుటుంబ ఆస్తులు ఆనక ఐదేళ్ళ కాలంలో ఐదు డిజిట్ల కోట్ల రేంజ్‌కి ఎలా పెరిగాయో చెబితే వారు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జమానాలో కొడుకుపై ప్రేమతో చేసిన అవినీతి దందాల వల్ల రాష్ర్టంలో మంత్రులు, ఐఎఎస్ అధికారులు జైలుకు వెళ్ళిన ఉదంతాలను ఆమె మరచినట్టున్నారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ వాస్తవాలు చెప్పివుంటే పరిస్థితి ఇలా వుండేది కాదని, తన భర్త దర్యాప్తు సంస్థకు సహకరించారని భారతి చెప్పడం సత్యదూరమని న్యాయవాదులు అంటున్నారు. ఈకేసు న్యాయస్థానం పర్యవేక్షణలో సాగుతున్నదనే విషయాన్ని భారతి దృష్టిలో వుంచుకోవడం లేదని వారంటున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు సిబిఐ నమోదు చేసిన కేసు ఇది కాదని వారు గుర్తు చేస్తున్నారు.
దర్యాప్తు సంస్థ నిజానిజాలను నిగ్గుతేల్చి, న్యాయస్థానం ముందు నిందితులను నిలబెట్టే బాధ్యతతోనే సరిపెట్టుకుంటుందని, అందులో దోషులు ఎవరు, కాదు అనే సంగతిని న్యాయస్థానం నిర్థారిస్తుందని వారు చెబుతున్నారు. అభి యోగాలు నమోదైనంత మాత్రాన దోషికాదని అంటున్నారు. వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు వేల కోట్ల రూపాయల దేశవిదేశీ లావాదేవీలతో ముడిపడి కేసు కనుక దర్యాప్తు పూర్తికి సమయం పడుతుందని,
అలాగే విచారణ, తీర్పునకూ ఎక్కువ సమయమే తీసుకుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ దశల్లో భర్త నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు భార్యగా తన ప్రయత్నం చేయాల్సింది పోయి, దర్యాప్తు సంస్థపై అక్కస్సు వెళ్ళగక్కడం, దర్యాప్తు సంస్థ అధికారులపై అనవసర వ్యాఖ్యలు చేయడం, లేఖాస్త్రాలు సంధిస్తే భర్త చేసిన అవినీతి కార్యాలు లేకుండా పోతాయా అని వారు ప్రశ్నిస్తున్నారు.
తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాల్సిన అవసరం వుందని న్యాయవాదులు అంటున్నారు. ఈ లేఖలు, వాదనల ద్వారా తన భర్తను అన్యాయంగా జైలులో పెట్టారని చెప్పుకుని, సానుభూతి పొందే ప్రయత్నం తప్ప మరొకటి కాదని భారతి వ్యవహార శైలిపై మరికొందరు న్యాయవాదులు ఆక్షేపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more