ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలెట్టిన టిఆర్‌ఎస్ పార్టీలోకి టి కాంగ్రెస్‌ఎంపీలు మంథా జగన్నాథం, జి.వివేక్, రాజయ్య, మాజీ పీసీసీ సభ్యుడు అయిన కే. కేశవ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. వీరు జూన్ 2వ తేదీన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ఇటీవలే వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చివరి గడువుగా ఈ నెల 30వ తేదీని పెట్టి, ఆలోగా తెలంగాణ అంశాన్ని తేల్చాలని అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి గడువులను పార్టీ అధిష్టానం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు పెట్టిన డెడ్ లైన్ కి కూడా అక్కడి నుండి సమాధానం రావడం లేదు. ఇక చివరి ప్రయత్నంగా కూడా వివేక్, రాజయ్యలు ప్రధాని విందుకు హాజరై అక్కడ అమ్మని కలవాలని చూసిన వీరిని పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. దీంతో బాగా కలత చెందిన వీరు రాజకీయ భవిష్యత్తును ఆలోచించి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయినట్లు, వీరిని రాక ఇక లాంఛనమే అని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఇక ఇటీవలే టి. కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ ఫాం హౌజ్ లో కలిసి దీని పై చర్చించడం, గతంలో కేసీఆర్ కేకే నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది. మొన్న జరిగిన భేటీలో వీరికి కేటాయించబోయే సీట్ల పై కేసీఆర్ భరోసా ఇవ్వడంతో వీరు కూడా గోడ దూకేందుకు రెఢీగా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకేసారి నలుగురు ఎంపీలు రావడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, భారీ బహిరంగ సభను నిజాం కళాశాలలో ఏర్పట్లు కూడా చేయడానికి సిద్ధం అయింది. ఈ సభ విజయవంతం అయితే మరింత మందిని టీఆర్ఎస్ లోకి ఆకర్షించాలని చూస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more