ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు రైల్వే శాఖ మంత్రి బన్సల్ మేనల్లుడు 90 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికిన నేపథ్యం.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వనీకుమార్ సిబిఐ నివేధికను మార్చడం లాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని వారిపై రాజీనామా వేటు వేసింది. ఇదిలా ఉండగా అవినీతి విషయంలో కాంగ్రెస్ సీరియస్‌గా ఉందన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా ఉండేందుకు రాష్ర్ట కాంగ్రెస్‌లో కూడా ఇదే విధమైన ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ విషయమై గత మూడు రోజులుగా ఢిల్లీలో అధిష్టానం అటు సి.ఎంతోను, ఇటు పిసిసి అధ్యక్షునితోను పలు దఫాలుగా చర్చించారు. ఇందులో ముఖ్యమంత్రి కిరణ్గ్‌కుమార్ రెడ్డి రాజీనామాలను వ్యతిరేకించినట్టు సమాచారం. మంత్రుల ఎలాంటి లబ్ది పొందలేదని కేవలం అప్పటి ముఖ్యమంత్రి వత్తిడి మేరేక వారు సంతకాలు చేశారని అందువల్ల వారిని తొలగించడం మంచిది కాదని దీని వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని వాధించినట్టు తెలిసింది.
అయితే ఈ అంశాలను మాత్రం అధిష్టానం అంగీకరించకుండా కేంద్రం చేసిన ఫార్ములాను అమలు చేయాలని అందువల్ల పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ నష్టపోకుండా చూడాలని అధిష్టానం ఆదేశించింది. కాగా మంత్రుల రాజీనామాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చాల ఆవేధనతో ఉన్నట్టుగా కూడా సమాచారం. జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించడానికి సహకరించారని భావిస్తున్న ఆరుగురు మంత్రులపై సిబిఐ ఆరోపణలు చేస్తూ నివేదికలు తయారు చేసింది. 26 ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవ డానికి అవకాశం ఏర్పడిందని భావిస్తూ సిబిఐ ఆరుగురు మంత్రులపై అభియోగాలు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో దాల్మియా సిమెంట్స్‌కు గనుల కేటాయింపుల విషయంలో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాన్‌పిక్ భూముల కేటాయింపుల వ్యవహారంలో అప్పటి రెవిన్యూమంత్రి ధర్మాన ప్రసాద్ రావులపై సిబిఐ అభియోగాలు నమోదు చేయడమే కాకుండా ఛార్జీషీట్‌లో కూడా పేరు నమోదు చేసింది. దీంతో ధర్మాన ప్రసాద్ రావు తనపై సిబిఐ ఛార్జీషీట్ నమోదు చేయగానే ఆయన ఆగస్టు 14వ తేదీనే తన రాజీనామాను ముఖ్యమంత్రిక అందజేశారు.
అయితే ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించకుండా ఆయనను పదవిలో కొనసాగించారు ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి పైనా అవినీతి మంత్రులను కాపాడుతున్నారనే ఆరోపణలు వెల్లవెత్తాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతికి పాల్పడలేదని అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేశారని ఈ కేసుల్లో ఈ మంత్రులు లబ్ది పొందలేదని వాధిస్తున్నారు.
అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయంపై ఈ ఇద్దరు మంత్రుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచా రం. ఎవరో చేసిన తప్పులకు తాము బలయ్యామని వారు వాపోయారు. సొంత పార్టీ నేతలే ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేశారని సన్ని హితులతో బాధపడినట్లు సమాచారం. గత ఆగస్టు 14న తాను రాజీనామా చేసినప్పుడే ఆమోదించి ఉంటే ఇంత రాద్దాంతం ఉండేది కాదని ధర్మాన అన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more