టాలీవుడ్ నుండి మరో నటుడు తన బ్యాచ్ లర్ లైప్ కు తెర వేశాసాడు. ఎంతో మంది అమ్మాయిలను పెళ్లి చూపులు చూశాడు ఈ చంద్రుడు. కానీ ఈ యంగ్ హీరోకి సరైన జోడి దొరలేదు. కానీ చివరకు ఫిలిం ఇండస్ట్రీలోనే మన హీరోకి ఓ చక్కని చందమామ దొరికింది. గోపికల కోసం వెతికిన ఈ గోపీచంద్ కు హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మతో పెళ్లి చూపులు కలిశాయి. గోపీచంద్ లో ఉన్న ‘సాహసం’బాగా నచ్చిందని రేష్మ చెబుతుంది. ఈ టాలీవుడ్ మొగుడు కు రేష్మ సరైన జోడీ అని ఇరు కుటుంబ సభ్యులు అంటున్నారు. హీరో శ్రీకాంత్ మేనకోడలు అయిన రేష్మను గోపీచంద్ వివాహం చేసుకుంటున్నారు.
మే 12న రాత్రి 2.16 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ మహోత్సవం జరుగనుంది. ఈ రోజు జరిగే ఈ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తరలి వస్తోంది. గోపీచంద్ సంగీత పార్టీ ఏర్పాటు చేశారు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఈ సంగీత పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ప్రక్కనున్న ఫోటో రేష్మ. గోపీచంద్ కు తగ్గ జోడీ అంటున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం గత డిసెంబర్ 23వ తేదీన జరిగింది. ఇంతకుముందు గోపీచంద్‌కు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన హరితతో పెళ్లి నిశ్చయమైనప్పటికీ అనుకోని కారణాలతో అది రద్దయిన విషయం విధితమే. గోపీచంద్ వివాహానికి తెలుగు విశేష్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more