రాష్ట్ర ముఖ్య నాయకులు అందరు కలిసి .. ఒక్కరినే టార్గట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జోరుగా సాగుతున్న కార్యక్రమం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అసమ్మతి మంత్రులు ఓవైపు తెలంగాణ ఎంపీలు మరోవైపు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. కిరణ్ ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ ఎంపీలు ఏకంగా రాహుల్ కే నివేదించగా పీసీసీ చీఫ్ బొత్స నేతృత్వంలోని అసమ్మతి మంత్రులు కాంగ్రెస్ కోర్ కమిటీకి కిరణ్ ధోరణిపై ఫిర్యాదు చేస్తున్నారు. కిరణ్ తీరు వల్ల పార్టీ నష్టపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీలో రోజురోజుకు వ్యతిరేకుల సంఖ్య పెరిగి పోతుంది. ఇంతకాలం ఎవరికి వారే సిఎంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు ఇప్పుడు ఐక్యమవుతున్నారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బొత్స నివాసంలో సమావేశమైన మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి,జానారెడ్డి,వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి కిరణ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. బయ్యారం గనులను విశాఖ స్టీల్స్ కు కేటాయించడం, బంగారుతల్లి పథకం ప్రకటించడం లాంటి కీలక నిర్ణయాల్లో తమను ముఖ్యమంత్రి సంప్రదించడంలేదని వారు ఆవేదన చెందారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రితో తాడో పేడో తేల్చుకునేందుకు వారు బొత్సను ఢిల్లీకి పంపించారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన బొత్స.. కిరణ్ తీరుపై సీనియర్ మంత్రుల అభిప్రాయాలతోపాటు పార్టీ అధ్యక్షుడైన తనను కూడా సిఎం పట్టించుకోవడంలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక అసమ్మతి మంత్రులు కేవలం ఫిర్యాదులతో కిరణ్ ను టార్గెట్ చేస్తుండగా టి ఎంపీలు ఏకంగా రాహుల్ గాంధీ ముందే కిరణ్ పై విమర్శలు గుప్పించారు. పార్టీ ఎంపీలను కిరణ్ అవమానపరుస్తున్నాడని కనీసం తమను జిల్లా పర్యటనలకు కూడా ఆహ్వానించడంలేదని ఫిర్యాదు చేసారు. మరోవైపు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనే సంకేతాలిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఎంపీల ఫిర్యాదు మేరకు రాష్ర్ట పార్టీలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ పూర్తి నివేదిక కోరినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంపీల ఫిర్యాదులో నిజమెంతో తెలుసుకునేందుకు రాష ్ర్ట పార్టీ అదనపు ఇంచార్జీ కెబి కృష్ణమూర్తిని హైదరాబాద్ కు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న హైదరాబాద్ వచ్చిన కృష్టమూర్తి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ ఫిర్యాదు మేరకే కెబి హైద్రాబాద్ కు వచ్చి సిఎం వివరణ కోరినట్లు టి.ఎంపీలు చెబుతుండగా కృష్ణమూర్తి మాత్రం దాన్ని ఖండిస్తూ ఎంపీలకు ముఖ్యమంత్రి మధ్య ఎటువంటి విబేధాలు లేవంటున్నారు.అసమ్మతి మంత్రులు, టిఎంపీల ఫిర్యాదుల పర్వం నేపథ్యంలో వాటిని ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి వర్గం కూడా రంగంలోకి దిగింది. సిఎంపై నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో విమర్శల వెనుక దాగున్న ఎజెండా ఎంటో వివరిస్తూ సిఎం సన్నిహితులు ఇప్పటికే హైకమాండక్ నివేదికలు పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more