రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉందా లేక ముఖ్యమంత్రి పాలనలో ఉందా అంటూ అనుమానం వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని కూడా పరోక్షంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. క్యాబినెట్లో మంత్రిగా ఉన్న రామచంద్రయ్య ఏకంగా సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై గురి పెట్టి మాట్లా డటం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. రాజ కీయవర్గాల్లో చర్చకు తెరలేపింది. కేంద్ర మంత్రి చిరంజీవిని పొగుడుతూ, కాంగ్రెస్ పార్టీలో విలీనమైన పీఆర్పీ నేతలకు, ప్రజాప్రతినిధులకు సరైన స్థానం గుర్తింపు, కీలకమైన నిర్ణయాల్లో తమకు పాత్ర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 2014 సార్వ త్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రి చిరంజీవి అర్హుడేనని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రజలు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఒక కేబినెట్ మంత్రిగానే కాకుండా, చిరంజీవి అనుచరుడిగా, పీఆర్పీ నాయకుడిగా రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు తీసిపారేయడానికి వీల్లేదు. అంతే కాకుండా ఆయన ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. ఇక రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతుందా లేక క్యాబినెట్ ఉందా.. లేదా.. సీఎం ముఖ్యమంత్రి ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ అప్రస్వామిక పద్ధ తుల్లో దూసుకుని పోతున్నారని, ఒంటెత్తు పోకడలు పోతున్నారని దుమ్మెత్తిపోశారు. ఆయన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలోను, ప్రతిపక్ష పార్టీలోను కొత్త కోణానికి తెరలేపింది. కేంద్ర మంత్రి చిరంజీవి ఇచ్చిన సంకేతాలతోనే రామచంద్రయ్య ఈ వ్యాఖ్యలు చేశారన్న అనుమానాలు కూడా వినవస్తున్నాయి,
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more