ఈరోజు మహవీర్ జయంతి. దేశమంతటా పండుగ జైనులు పండుగ చేసుకుంటున్నారు. జైన మతస్తులకు ఈరోజు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈరోజు జైన్ భక్తులందరూ ఏదో ఒక దానధర్మ కర్మలను ఆచరించి, ప్రార్ధనలు చెయ్యటం, దేవాలయ సందర్శనం, ధ్యానం చెయ్యటం చేస్తారు. ఆలయాల్లో మహావీర్ ఉపదేశించిన వాక్యాలను ప్రవచనాల్లో చెప్తారు. ఆలయాల్లో మహావీరుని విగ్రహానికి అభిషేకాలు చేస్తారు.
ఫోటోలో ఉన్నది అజ్మేర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్టీ దర్గా సమీపంలో మహావీర్ జైన్ ఊరేగింపు.
మానవ జీవిత విలువలు, అహింసా ధర్మం, సర్వమానవ ప్రేమ బోధించిన మహావీర్ జైన్ 24వ , ఆఖరి తీర్థంకరుడు.
వర్ధమానుడు అనబడే మహావీర్ బీహార్ లో మహారాజ సిద్ధార్థ, రాణి త్రిషాల ల పుత్రుడు. ఆయన తన 30 సంవత్సరాల వయసులో సింహాసాన్ని వదిలి రాజ్యాన్ని త్యజించి సన్యసించి 12 సంవత్సరాలు అతినిష్టతో గడిపాడు. అప్పటి నుండి తన 72 వ సంవత్సరంలో చనిపోయేంత వరకు ఆయన ఆధ్యాత్మిక స్వేచ్చ గురించి బోధిస్తూ వచ్చారు.
కర్నాటక లోని శ్రావణబెళగుళా లోని అరవై అడుగుల బాహుబలి లేక గోమఠేశ్వరుని విగ్రహం మొదటి తీర్థంకరుడు ఋషభ నూరుగురు కుమారులలో రెండవ వాడు. ఇక్కడ కూడా జైన మతస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు.
సన్యసించటం, ధ్యానం, దానం, నిరాడంబరత, అహింస, కఠినమైన ఆహార నియమాలు ఇవి జైనమతాన్ని అనుసరించేవారు అవలంబించే మార్గాలు. మాంసాహారం, మద్యపానం పూర్తిగా వర్జితం. ఉల్లి, వెల్లుల్లే కాదు, భూమి కింద పండే వాటిని దేన్నీ వీరు ఆరగించరు. అంటే ఏ గడ్డలూ, దుంపలూ, వేళ్ళను వీరు ఆహారంగా స్వీకరించరు. కేవలం చెట్టు పైన పండే కాయలను మాత్రమే ఆరగిస్తారు.
పర్వదినం కాబట్టి ఈ రోజు వేడుకలు చేసుకుంటారు కానీ అందులో కూడా నియమనిష్టలుంటాయి. అంతే కానీ విందులు విహారాల కోసం కాదు. జైనమతంలోని నియమాలను గుర్తు చేసుకోవటానికి వాటిని ఆచరించటానికే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more