బాలీవుడ్ బడా నటుడు, అమితాబ్ బచ్చన్ అంటే అందరికి ఆదర్శం. ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. అందుకే అమితాబ్ బచ్చన్ ని బాలీవుడ్ బిగ్ బీ అన్నారు. రీసెంట్ ఆయన హైదరాబాద్ జరిగిన నంది అవార్డు ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అయితే నంది అవార్డు ఫంక్షన్లో ఆయన ప్రదర్శించిన తీరు తెలుగు వారి హ్రుదయాలను తాకింది. ఫంక్షన్ చివరకు ఉండి తన గొప్పతానాన్ని చాటుకున్నారు. అయితే మన తెలుగు హీరోలు మాత్రం ఫంక్షన్ జరుగుతున్న మద్యలోనే లేచి వెళ్లిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఫంక్షన్ కు వచ్చిన ముఖ్య అతిథిని మన తెలుగు హీరోలు అవమానించినట్లుగా ఉందని సినీ పెద్దలు అంటున్నారు. అమితాబ్ బచ్చన్ మాత్రం తనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలిపి టాలీవుడ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. కానీ అబితాబ్ బచ్చన్ ఒక పెద్ద తప్పు చేసినట్లు అభిమానులు ముందు ఒప్పుకున్నాడు. కానీ ఆ తప్పు ఏమిటో మీరే చెప్పాలని అభిమానులను అడిగినట్లు తెలుస్తోంది. బిగ్ బీ చేసిన తప్పు ను ఎవ్వరు చెప్పలేకపోయారు. చివరకు తను చేసిన తప్పు ఏమిటో ఆయన స్వయంగా చెప్పాడు. ఆ తప్పు ఏమిటో తెలుసా? ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పును ఈరోజు అమితాబ్ ఒప్పుకున్నాడు. తను ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు దొర్లిన తప్పును గుర్తు చేసుకొంటే తానో సాధారణ నటుణ్ని అనిపిస్తోందన్నారు.
ఇంతకీ ఆసినిమాలో అమితాబ్ ఏం తప్పు చేసాడంటే? 2005లో వచ్చిన ‘బ్లాక్’ అనే సినిమాలో దేవరాజ్ సహాయ్ అనే పాత్రలో నటించారు అమితాబ్. ఆ సినిమాలో ఆయనకు అల్జీమర్స్ వ్యాదిగ్రస్తుడిగా కనిపిస్తారు. ఆ చిత్రంలో నటనకుగాను అమితాబ్ జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం అందుకొన్నారు. కానీ ఆ సినిమాలో చెవిటి, మూగ అమ్మాయి పాత్ర పోషించిన రాణీముఖర్జీకి ఉపాధ్యాయుడిగా నటించాడు బిగ్ బీ. అయితే ఆ సమయంలో రాణీముఖర్జీ ఒక బల్లపై ఒక ఉత్తరం ఉంచుతుంది. ఆ ఉత్తరం అమితాబ్ తో చదివించటం కోసం ఆమె అలా చేస్తుంది. ఉత్తరాన్ని చదవడం కోసం అమితాబ్ నేరుగా జేబులో ఉన్న కళ్లజోడు తీసి చదవటం జరుగుతుంది. కానీ ఆ సన్నివేశంలో అమితాబ్ అలా చెయ్యకూడదు. ఎందుకంటే ఆ పాత్రా స్వభావం ప్రకారం, వ్యాది తాలూకు లక్షణాల్ని కళ్లజోడు వెదుక్కొనే క్రమంలోనే చూపించాలి. అలా చేయలేదు. ఎనిమిదేళ్లయినా ఆ సన్నివేశం చూసినా, గుర్తుకొచ్చినా నేను ఒక సాధారణ నటుణ్నే కదా అనిపిస్తోంది. ఆ సన్నివేశం నన్ను ఇప్పటికి తప్పు చేశాననే ఫిలింగ్ కలిగిస్తుంది. అందుకే నేను తప్పుచేసిన నటుడ్ని అని అందుకు ముందు ఒప్పుకోవటానికి నేను ఎప్పుడైన, ఎక్కడైన రెడీ అని అంటున్నారు అమితాబ్ బచ్చన్.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more