ఇండియా టు డే చేసిన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన రెడ్డి భారత రాజకీయాల్లో కేంద్ర బిందువు అవబోతున్నారు. 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో ఇప్పటికే పట్టు సాధించిన జగన్ 2014 ఎన్నికల్లో దేశరాజకీయాలను శాసించే 9 మందిలో ఒకరు అవటమే కాకుండా, వారిలో కీలకమైన కేంద్రస్థానాన్ని అలంకరించబోతున్నారని సర్వే నివేదిక తెలియజేస్తోంది.
దేశరాజకీయాలలో ప్రముఖపాత్రను వహించబోయే తొమ్మిది మంది వీరు-
ములాయమ్ సింగ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, కరుణానిధి, జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితిష్ కుమార్, వైయస్ జగన్మోహన్ రెడ్డి. వీరిలో 25 సీట్లతో జగన్మోహన్ రెడ్డి కేంద్రబిందువై కేంద్ర రాజకీయాలను శాసించే స్థితికి వచ్చే అవకాశం ఉందంటూ సర్వే వెల్లడి చేస్తోంది.
సర్వే నివేదిక చెప్పిన విషయాల్లో,
తెలంగాణా ప్రాంతంలోని ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లు కొందరు తెలంగాణా రాష్ట్ర సమితి వైపు మొగ్గు చూపిస్తుంటే మరికొందరు జగన్ పార్టీ వైపు చూపిస్తున్నారు. చాలా మంది నాయకులు జగన్ వైపు వెళ్ళటం ప్రారంభించారు. 2012 లో జగన్ ని జైల్లో వేసినా, ఎంతోమంది నాయకులు చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ ని కలవటానికి వెళ్ళారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకంటే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీయే పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీని బాగా ఎండగట్టి ప్రజలను తనవైపు తిప్పుకోగలిగింది. ఓదార్పు యాత్రలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోగలిగినా, ఆయన జైల్లో ఉన్నా, పార్టీకున్న ప్రచారం తగ్గకుండా జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పాటుపడుతున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఆపిన దగ్గరనుంచి అందుకుని షర్మిల పాదయాత్రను కొనసాగించి ప్రజలలోకి ఆ పార్టీని ఇంకా బాగా తీసుకెళ్ళగలిగింది.
సర్వేలో తేలిన విషయాలు నిజమై ఈలోపులో అందులో ఎలాంటి మార్పులూ సంభవించకుండా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపడదామనుకున్న జగన్ ఆ పనిలో విఫలమైనా ఇక ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో పాగా వేసినట్లే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more