కంమ్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) చేసిన పరిశీలన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరిన్ని అప్పులు చేస్తేనే గాని మనుగడ సాగించలేదని చెప్తోంది. ఇప్పటికే తీసుకున్న అప్పులను తిరిగిచ్చేందుకు ఇంకా అప్పులు చెయ్యటమే మార్గంలా కనిపిస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది.
గత ఐదు సంవత్సరాలుగా నిధులు సమకూర్చుకోవటమంటూ ఏమీ జరగలేదు కాబట్టి, ఒప్పందాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయాలంటే అప్పులు చేయటం తప్ప మరో ఉపాయం కనపడటం లేదని మార్చ్ 2012 వరకున్న ఆర్థిక స్థితిని చూసిన కాగ్ చెప్తోంది.
2009 నుంచి 2012 వరకు 42883 కోట్ల రూపాయల ఋణాలను తీసుకున్న రాష్ట్రం 2018 నుంచి వాటిని తిరిగి ఇవ్వవలసిన అవసరం ఉంది. స్టేట్ డెవెలప్ మెంట్ లోన్ లో ఏడు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీకి వస్తాయి. 2015-17, 2017-19 లలో రాష్ట్రం 9953 కోట్ల రూపాయలను చెల్లించవలసివుంటుంది. అందువలన, ఒకవేళ ఋణం తీసుకున్నా వాటి చెల్లింపులు పైన పేర్కొన్న ఆర్థిక సంవత్సరాలలో ఉండకుండా ఉండేట్టు చూసుకోవాలని కూడా కాగ్ తెలియజేసింది.
రాష్ట్రం తన ఆదాయ వనరులను పెంచుకుంటూ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా ఋణస్థితి నియంత్రణలో ఉంటుందని కాగ్ సూచించింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడుల మీద వచ్చిన ఆదాయం కేవలం 0.85 శాతమేనని, అది చాలా తక్కువని కూడా తెలియజేసింది. చాలా కార్పొరేషన్ల ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఫైనల్ అయినంత వరకు చూసుకుంటే 5979 కోట్ల రూపాయల మొత్తం నష్టం కనిపిస్తోంది. ప్రభుత్వానికి నష్టాలను తెచ్చిపెడుతున్న కార్పొరేషన్లలో 3554 కోట్ల రూపాయలతో స్టేట్ హౌసింగ్ అగ్రస్థానంలో ఉండగా, ఆర్ టి సి 1984 కోట్ల వరకూ ప్రభుత్వానికి నష్టాల వడ్డన చేస్తోంది.
ఇక రాయితీ ఖర్చులు చూసుకుంటే, 7313 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాయితీల రూపంలో ఖర్చు పెడుతోంది. అందులో బియ్యం మీద 2280 కోట్లు, విద్యుత్ మీద 4300 కోట్లు, మిగిలిన రాయితీల మీద 733 కోట్లున్నాయి.
అందువలన, అప్పులు చేసి, ఇప్పటికే చేసిన అప్పుల మీద చెల్లింపులు చెయ్యవలసిన అగత్యం ఉందని కాగ్ హెచ్చరిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more