మహిళలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం మహిళలకు శృంగార వయోపరిమితిని తగ్గించే విధంగా ప్రణాళిక సిద్దం చేసింది. అయితే దీనిపై కొన్ని పొలిటికల్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. శృంగార వయోపరిమితిని 18 నుండి 16కు తగ్గించే ప్రతిపాదనపై వివిధ రాజకీయ పార్టీల నుండి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో ప్రభుత్వం వెనకుడుగు వేసింది.వయోపరిమితిలో ఎటువంటి మార్పు చేయకూదదని, యధాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. మహిళలపట్ల వెకిలిగా ప్రవర్తించడం, అభ్యంతరకర చేష్టలు ప్రదర్శించడం నాన్‌బెయిలబుల్ నేరాలుగా పరిగణించాలనే విషయంలో కూడా ప్రభుత్వ వైఖరికి ఎదురుదెబ్బ తగిలింది. అటువంటి చేష్టలకు పాల్పడలేదని నిరూపించుకునేందుకు మొత్తం భారాన్ని నిందితునిపై మోపడం తగదని రాజకీయ పార్టీలు వ్యాఖ్యానించడంతో ఈ విషయంలోనూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు.
ఏప్రిల్ మూడులోపు ఆర్డినెన్స్‌కు చట్ట రూపం కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అత్యాచార నిరోధక బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీల ప్రతినిధులు శృంగార వయోపరిమితిని కుదించటంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అఖిలపక్ష భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాధ్ మాట్లాడుతూ బిల్లు మౌలిక ఉద్దేశంపై ప్రాధమికంగా ఏకాభిప్రాయం వున్నప్పటికీ, బిల్లులో పొందుపర్చిన కొన్ని కఠిన నియమ నిబంధనలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ఆందోళనను వ్యక్తంచేశారని వివరించారు. పరస్పర ఆమోదిత శృంగార వయోపరమితిని 18 ఏళ్ల నుండి 16 ఏళ్లకు తగ్గించటంపై బిజెపి, సమాజ్‌వాది, తదితర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయని చెప్పారు.
కొన్ని పార్టీలు మాత్రం వివాహానికి ముందు శృంగారం ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నదని, అందువల్ల పరస్పర ఆమోదిత శృంగార వయోపరిమితిని 16 ఏళ్లకు తగ్గించటం సమంజసమేనని అభిప్రాయపడ్డాయని ఆయన చెప్పారు. గత డిసెంబర్ నెలలో ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన అనంతరం మహిళలపై లైంగిక హింసను నిరోధించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more