శాసనసభలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి రూ.1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అగ్రాసనం వేస్తుందన్నారు. వ్యవసాయం రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. ఉగాది నుంచి పేదలకు రేషన్ కార్డు ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, దాని కోసం రూ.660 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో మెరుగైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పంచాయితీ ఎన్నికలో నిర్వహించేందుకు సుప్రీం అనుమతివ్వడం సంతోషకరమన్నారు. గతేడాది రావాల్సిన గ్రాంటు రూ.1,582 కోట్లు విడుదలవుతాయని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ.59429 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.1,01,926 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.1023 కోట్లు, ద్రవ్యలోటు రూ.24487 కోట్లు. కాగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని రెండు హామీలో ఈ బడ్జెట్‌లోనూ ప్రస్తావనకు రాలేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, వ్యక్తికి ఆరు కిలోల బియ్యం హామీ ఈ బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు.
బడ్జెట్‌లోని అంశాలు :
రాష్ట్ర బడ్జెట్ రూ. 1,61,348 కోట్లు
గతంలో 1,45,854 కోట్లు
ప్రణాళికేతర వ్యవయం రూ.1,01,926 కోట్లు
గతంలో రూ.91,824కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 59,422 కోట్లు
గతంలో రూ.54,030కోట్లు
రెవిన్యూ మిగులు రూ. 1023 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు 6128 కోట్లు
గతేడాది రూ. 2800 కోట్లు
సాంఘిక సంక్షేమ శాఖ కు 4122 కోట్లు
గతేడాది రూ. 17019కోట్లు
గిరిజన సంక్షేమం రూ. 2126 కోట్లు
గతేడాది రూ. 1013కోట్లు
బీసీ సంక్షేమం రూ. 4027 కోట్లు
గతేడాది రూ. 2656 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 1027 కోట్లు
గతేడాది రూ. 482 కోట్లు
మహిళా శిశు సంక్షేమం రూ. 2712
గతేడాది రూ. 2282 కోట్లు
వికలాంగుల సంక్షేమం రూ. 73 కోట్లు
యువజన సేవలు రూ.280 కోట్లు
గతేడాది రూ. 343 కోట్లు
పర్యాటక రంగం రూ. 163 కోట్లు
గృహనిర్మాణం రూ. 2326 కోట్లు
గతేడాది రూ. 2300 కోట్లు
పౌరసరఫరాలు రూ. 3231 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ. 11200 కోట్లు
గతేడాది రూ. 5855 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 6770 కోట్లు
వైద్య ఆరోగ్యం రూ. 6481 కోట్లు
ఉన్నత విద్య రూ. 4082 కోట్లు
పాఠశాల విద్య రూ. 16990 కోట్లు
మౌలిక సదుపాయాలకు రూ. 180 కోట్లు
రోడ్లు భవనాలు రూ. 5451 కోట్లు
గతేడాది రూ. 3210 కోట్లు
ఇంధన, విద్యుత్ రంగాలకు రూ. 7117 కోట్లు
నీటిపారుదలకు రూ. 13800 కోట్లు
గతంలో కంటే తగ్గిన జలయజ్ఞం కేటాయింపులు
గతేడాదితో పోలిస్తే రూ. 12017 కోట్లు తగ్గుదల
గతేడాది రూ. 15013 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ. 1120 కోట్లు
ఐటీ రంగానికి రూ. 207 కోట్లు
శాంతి భద్రతలకు రూ. 5386 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ రూ. 100 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ : రాష్ట్ర బడ్జెట్ లో రూ. 25, 962 కోట్లతో వ్యవసాయబడ్జెట్ ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు.
వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ. 17, 694 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం రూ. 8, 267 కోట్లు
ఈ ఏడాది రూ. 72, 450 కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6. 128 కోట్లు
ప్రక్రుతి వైపరీత్యాలకు వ్యవసాయ బడ్జెట్ లో రూ. 589 కోట్లు
పుడ్ ప్రాసెసింగ్ కు రూ. 100 కోట్లు
కనీస మద్దతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో ఆలంబన నిధి. ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి ఆనం ప్రకటించారు.
ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ ప్రత్యేక యూనిట్ వడ్డిలేని పంట రుణాలకు ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది.
విత్తనాభివ్రుద్దికి రూ. 308 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 450 కోట్లు
సోలార్ పంప్ సెట్లకు రూ. 150 కోట్లు
రాష్ట్ర సర్వతోముఖాభివ్రుద్దికి 2013-14 బడ్జెట్ దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more