General v k singh talks on indo pak relation and kashmir

indo pak relation, gen v k singh, kashmir issue

gen v k singh talks on indo-pak relation and kashmir

vk-singh.png

Posted: 03/05/2013 05:01 PM IST
General v k singh talks on indo pak relation and kashmir

gen-vk-singhసంఘ సంస్కర్త, అవినీతికి ఎదురొడ్డి పోరాడటానికి కంకణం కట్టుకున్న అన్నా హజారేతో మాజీ జనరల్ వి.కె.సింగ్ చేతులు కలిపారు.  ఛీఫ్ ఆఫ్ ధి ఆర్మీ స్టాఫ్ గా పదవీ విరమణ చేసిన వి.కె.సింగ్.  మిలిటరీ రికార్డ్ లలోని ఆయన జన్మదినం విషయంలో జరిగిన తర్జన భర్జనలు, పదవీ కాలాన్ని పొడిగించటం కోసం సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్ వీటన్నిటి తర్వాత చివరకు పదవీ విరమణ చెయ్యవలసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత, వి.కె.సింగ్ బహిరంగంగా వ్యాఖ్యానాలు చెయ్యటం మొదలుపెట్టారు.  హజారే ఛత్రఛాయలో కొత్తగా ఏర్పడ్డ జనతంత్ర మోర్చ పార్టీకి వి.కె.సింగ్ అధ్యక్షులు.  చారిత్రాత్మక ప్రదేశమైన జలియన్వాలా బాగ్ లో ఈ పార్టీకి శుభారంభం జరిగింది.  అన్నా హజారే లాగే నేను కూడా అవినీతికి వ్యతిరేకిని, అందుకే ఆయనతో కలిసాను అంటారు జనరల్ సింగ్.

రక్షణ శాఖకు ఇచ్చిన ఆయుధాలు, సాధనాలు నాసిరకమైనవని లోగడ వ్యాఖ్యానించినట్టుగా నిజాన్ని నిర్భయంగా తనదైన శైలిలో చెప్పే వి.కె.సింగ్ కొన్ని అంశాల మీద బాహాటంగా తన అభిప్రాయాలను తెలియజేసారు.  ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ ల మధ్య గల సంబంధాన్ని, కాశ్మీర్ సమస్య, సరిహద్దు వివాదాల గురించి వివరంగా తెలియజేసారు. 

వ్యక్తిగతంగా తనకి మంచి పొరుగు ఉండటమే ఇష్టం కాబట్టి, భారత్ పాక్ ల మధ్య ఎప్పుడూ శాంతినే కాంక్షిస్తాన్నారాయన.  అటువంటి దానికి మధ్య కాశ్మీరు సమస్య అడ్డుపడటం కూడా నాకు ఇష్టం లేదు.  అలాగని 1947 నుంచీ పాకిస్తాన్ కాశ్మీర్ మీద మనసు పడి ఉండటాన్ని కూడా నేను అంగీకరించలేని అంశం.  సియాషిన్ 1984లో భారత్ సేనల స్వాధీనం అయిన దగ్గర్నుంచీ, పాకిస్తాన్ గొంతులో వెలక్కాయ పడ్డట్టవుతోంది.  మిలటరీని సియాషిన్ నుంచి ఉపసంహరించుకుంటే కాశ్మీర్ సమస్య పోతుందని కొందరంటున్నారు కదా, ఆ కమిటీలో ఉన్నది ఎవరో తెలుసా.  ఎయిర్ ఛీఫ్ మార్షల్ త్యాగి, మిలటరీ కబుర్లను ఎక్కించే జర్నలిస్ట్ కల్నల్ అజయ్ శుక్లా అంటూ ఘాటుగా చెప్పారు వి.కె.సింగ్.

వాళ్ళకి అసలు నిజమేమిటో తెలియదు.  వాళ్ళు ఆ ప్రాంతాలను చూసెరుగరు.  సాల్తోరో పర్వత శ్రేణుల్లో ఉన్న సియాషిన్ గ్లేసియర్ లో నుంచి మిలటరీని ఉపసంహరించుకోమంటున్నారు.  సియాషిన్ పాకిస్తాన్ వశంలో లేదసలు.  పాక్ తన దేశ ప్రజలను మోసపుచ్చుతోంది.  సియాషిన్ కి పశ్చిమ భాగంలో ఉన్నారు పాకిస్తాన్ సైనికులు.   పై భాగమంతా భారత్ ఆధీనంలో ఉంది.  నేల మీద ఇదమిద్ధంగా సరిహద్దు లైన్ ని గీచే స్థితిలో పాకిస్తాన్ లేదు.  అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ని, భారత్ ని సైన్యాన్ని ఉపసంహరించుకోమనటంలో అర్థమే లేదు.  భారత్ సేనలు ఎత్తైన ప్రదేశంలో అక్కడి ప్రదేశం మీద పట్టు కలిగి ఉన్నారు.  ఇప్పుడు వాళ్ళని ఉపసంహరించుకోమని అనటం అంటే, మరో కార్గల్ యుద్ధానికి తెరదించినట్లే.  

మరోపక్క అమెరికా ప్రభుత్వం,  భారత్ పాకిస్తాన్ ల మధ్య విభేదాలు పోయి ఏకమైతే ప్రపంచంలో శక్తివంతంగా గా తయారవుతున్న చైనాని నియంత్రించవచ్చని పిచ్చి ఆశలో ఉంది.  అది జరిగే పని కాదు.  పాకిస్తాన్ చెయ్యగలిగిందఒకటే, ఉగ్రవాదులను ఉత్పత్తి చేసి వదలటం.  పాకిస్తాన్ కి భారత్ తో మాట్లాడేటప్పుడు కాశ్మీర్ మాట ఎత్తటం ఎందుకంటే దానితో ముల్లుతో గుచ్చినట్టు భారత్ ని గుచ్చటానికే.  పాకిస్తాన్ కి కాశ్మీర్ ఆ విధంగా ఒక ఆయుధం అంతే.  కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ భారత్ కి ఎదురు నిలవటానికి సైన్యాన్ని తయారుచేసుకుంటుంది.  పాకిస్తాన్ కి దానికంటూ ఎన్నో సమస్యలున్నాయి.  బెలూచీస్తాన్, క్వెట్టా, లాహోర్, ఇంకా న్యాయపరమైన సమస్యలు, సామాజిక సమస్యలూ అన్నీ పాకిస్తాన్ లో హెచ్చు స్థాయిలోనే ఉన్నాయి.  అందుకే భారత పట్ల విద్వేషాన్ని పెంచుతూ, సరిహద్దు సమస్యలను ఎప్పుడూ తాజాగా ఉంచుతుంటుంది.

ఇక భారత్ వైపు చూస్తే, కాశ్మీర్ విషయంలో భారత్ కి ఒక విధానమంటూ ఇదమిద్ధంగా ఏమీ లేదు.  రాజకీయ స్థితిగతులనుబట్టి అవి నిరంతరం మారుతూ ఉంటాయి.  రాజకీయ లబ్ధి కోసం డబ్బు పారుతుంటుంది కానీ అది సరైన చేతుల్లోకి పోదు.  కాశ్మీర్ లో ఒక కమాండర్ గా పనిచేసాను, బెటాలియన్ నడిపాను, ఒక బ్రిగేడ్ ని నిర్వహించిన నాకు అక్కడి విషయాలు క్షుణ్ణంగా తెలుసు.  కాశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలు సమర్ధవంతంగా జరిగాయి కానీ లాభమేమిటి.  వాటికి అధికారాలివ్వటానికి ఇష్టపడరు మళ్ళీ.  అమర్ నాథ్ కేసు ఏమయింది.  షోపియాన్ అత్యాచారం కేసుని పరిష్కరించే విధానమెలా ఉంది.  

కాశ్మీర్ విషయంలో వందలాది ఉదాహరణలు చెప్పుకోవచ్చు.  దారుణమైన అఫ్సా (ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) తో ఎటువంటి కోర్టు కేసలు లేకుండా మిలిటరీకి పూర్తి అధికారాలు ఇచ్చారు.  ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికే అదంతా చేసేది.  కాశ్మీర్ వాసుల భావోద్వేగాలతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఒక వర్గాన్ని మరో వర్గం అనుమానంగా చూడటం, ఎంత మాత్రం నమ్మలేకపోవటం లాంటి సామాజిక నష్టాలను అక్కడ కలుగజేస్తున్నారు.

చివరిగా, జనతంత్ర మోర్చా గురించి చెప్తూ, అన్నా హజరే 25 సూత్రాలతో తయారు చేసిన ప్రణాళిక, గ్రామాలు పట్టణాల్లోంచి అవినీతిని కూకటి వేళ్ళతో సమర్ధవంతంగా పెకిలించటానికి తయారుగా ఉందని అన్నారు వి.కె.సింగ్.  

అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొస్తూ, ఆ పార్టీ కార్యకర్తలు కూడా కలిసి పనిచెయ్యటానికి, గ్రామల్లో నేతలను తయారు చెయ్యటానికి మాతో సహకరించటానికి సిద్ధమంటూ మాతో చెయి కలుపుతున్నారన్నారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme issues notices to union govt
Budget impact on nris  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more