చివరకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ప్రైవేటు బ్యాంకులకు స్వాగతం పలుకుతోంది. దేశంలో ప్రైవేటు రంగంలో మరిన్ని బ్యాంకులను నెలకొల్పటానికి రంగం సిద్ధమైంది. 2010 నుంచే ప్రారంభమైన ఈ తంతు ఇప్పటికి రూపు దిద్దుకుంది. తాజాగా బ్యాంకులకు అనుమతులిస్తామంటూ ఫిబ్రవరి 2010 లో బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 2010 లో రిజర్వ్ బ్యాంక్ దాని పడ్డ తర్జనభర్జనలు వెలువడ్డాయి. డిసెంబరు 2010 లో, చర్చల్లో ఏ నిర్ణయానికీ రాలేకపోయినట్లుగా రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. ఆగస్టు 2011 లో ప్రైవేటు బ్యాంక్ లకు అనుమతినివ్వటానికి నమూనా మార్గదర్శకాలను తయారు చేసింది. చివరకు ఫిబ్రవరి 2013లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు తుది రూపాన్ని దిద్దుకున్నాయి.
నిన్న రిజర్వ్ బ్యాంకి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం,
1. ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు, బ్యాంక్ వ్యవహారాలలో లేని ఋణ సంస్థలూ (ఎన్.బి.ఎఫ్.సి) ఇందుకు అర్హమైనవే. అయితే అవి నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్ఓఎఫ్ హెచ్) ద్వారా జరగాలి.
2. బ్యాంక్ నిర్వహించుకునేందుకు అనుమతిని కోరే సంస్థలు జూలై 1 వరకు అప్లికేషన్లను సమర్పించవచ్చు.
3. సంస్థాపక వ్యక్తులు లేక గ్రూప్ లకు నిజాయితీతోనూ, విజయవంతంగానూ 10 సంవత్సరాలు వ్యాపారాన్ని నిర్వహించిన చరిత్ర కలిగి వుండాలి.
4. అనుమతిని కోరే సంస్థలకు వారు స్థాపించబోయే బ్యాంక్ ల లావాదేవీలతో సంబంధం ఉండగూడదు. ముఖ్యంగా వారి వ్యాపారం మార్కెట్ లో హెచ్చు తగ్గుల మీద ఆధారపడినదై వున్నప్పుడు ఆయా సంస్థల ఆర్థిక ఆటుపోట్ల వలన బ్యాంక్ వ్యవహారాలు దెబ్బతినగూడదు. అయితే రియల్ ఎస్టేట్ కానీ షేర్ల బ్రోకర్లగా పనిచేసే సంస్థల మీద రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలేమీ పెట్టలేదు. వారు కూడా బ్యాంక్ నడుపుకోవటానికి అనుమతిని కోరవచ్చు.
5. బ్యాంకింగ్ సంస్థ కనీస ప్రారంభ పెట్టుబడి 500 కోట్ల రూపాయలు ఉండాలి.
6. ఓటు హక్కున్న బ్యాంక్ షేర్ మనీలో ఎన్ఓఎఫ్ హెచ్ సి మొదట్లో 40 శాతం వాటా కలిగివుండాలి. అది 5 సంవత్సరాల కాలం వరకూ లాక్ లో ఉంటుంది. ఆ 40 శాతాన్ని 12 సంవత్సరాలలో 15 శాతానికి కుదించాలి.
7. బ్యాంక్ లావాదేవీలు ప్రారంభమైన మూడు సంవత్సరాలలో బ్యాంక్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ లోకి రావాలి. విదేశీ పెట్టుబడులన్నీ కలిసి 49 శాతం మించగూడదు.
8. ఎన్వోహెచ్ సి కి చెందిన డైరెక్టర్లు మొత్తం బ్యాంక్ డైరెక్టర్ల సంఖ్యలో కనీసం సగం ఉండాలి, వారు స్వతంత్ర డైరెక్టర్లై ఉండాలి. ఎన్వోహెచ్ సి కి చెందిన ఆర్థిక సంస్థలలో బ్యాంక్ వాటాలుండగూడదు.
9. కొత్త బ్యాంకుల శాఖలలో కనీసం 25 శాతం 10000 జనాభా వరకూ ఉన్న గ్రామీణ ప్రాంతాలలో శాఖలను తెరవాల్సివుంటుంది.
అలా పై షరతులతో రిజర్వ్ బ్యాంక్ కొత్త బ్యాంకుల కు స్వాగతం పలుకుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more