తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు అరవైలో కూడా ఇరవై ఏళ్ల యువకుడు మాదిరి రాష్ట్రంలో 13 జిల్లాలు తిరిగి .. ప్రజల్లో పాదచారి అయ్యాడు. వస్తున్నా మీకోసం అంటూ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటికే రెండు వేల కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశాడు. చంద్రబాబు పాదయాత్రలో అనేక కొత్త విషయాలను ఆయన నేర్చుకోవటం జరిగింది. ప్రత్యర్థి రాజకీయ నాయకులపై ఘాటైన విమర్శలు చేస్తే చంద్రబాబు ముందు సాగిపోతున్నారు. పాదయాత్ర గత ఏడాది అక్టోబర్ 02న ప్రారంభమైంది. పాదయాత్ర ముగింపు తేది కూడా ముందే చెప్పారు. జనవరి 26న చంద్రబాబు పాదయాత్ర ముగించాల్సి ఉంది. కానీ సీనియర్ నాయకుల సలహా మేరకు చంద్రబాబు పాదయాత్రను ఇంక కొనసాగిస్తున్నారు. అంటే చంద్రబాబు హైదరాబాద్ రావటం ఇష్టంలేక , ఇంక బాటసారిగా పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాష్ట్రం ప్రజల నుండి వస్తున్న స్పందనను చూసిన చంద్రబాబుకు పదవి మీద ఆశలు పెరిగినట్లగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా అదే స్టాయిలో ఆవిమర్శలను తిప్పికొడుతున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ, రాజ్యాంగం కోసం అంబేద్కర్ , తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ త్యాగాల గుర్తుగా వారి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. కానీ, రూ. లక్ష కోట్లు కొడుక్కి దోచి పెట్టిన వైఎస్ కు లక్ష విగ్రహాలు పెట్టడం ఇదెక్కడి నీచం? వైఎస్ ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని చంద్రబాబు పిలునిచ్చారు. అంతేకాకుండా వాళ్లు నీతిమంతులంటే మల మూత్రాలు పడేలా తంతారు అని బాబు ఆవేశంగా అన్నారు. బాబు మాటలకు టీడీపీ నాయకులు సైతం ఆశ్చర్యంతో వణికిపోయారు.
చంద్రబాబు నోట ఎప్పుడు రాని బూతులు రావటంతో పార్టీ కార్యకర్తలు, మీడియావారు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయినట్లు పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబులో నిగ్రశక్తి కోల్పోయి , ఏ మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు వయసు ముదిరిన కొద్ది ఆయనలో పైత్స్యం ముదిరిపోవటంతో అతని నోట వెంట బూతులు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏమైనా చంద్రబాబు మాత్రం తన పాదయాత్రతో ఒక రికార్డు స్రుష్టించినట్లు తెలుగుదేశ పార్టీ నాయకులు చెబుతున్నారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం సమర్థవంతమైన పాలన , ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్థ పరిపాలనపై బాబు డిబెట్ ఏర్పాటు చేసిన పల్లెలకు విస్తరింపజేయాలని టిడిపి శ్రేణులకు పిలుపు నిచ్చారు. చంద్రబాబు కుటుంబం కోసం పాదయాత్రలు చేయడం లేదని , ప్రజాసంక్షేమానికి చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి తెలిపారు. చంద్రబాబు రెండు వేల కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల మండపంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు జైళ్లలో వున్న తమ కుటుంబ సభ్యులు బయటికి రావాలని పాదయాత్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి చేస్తున్న పాదయాత్ర పై టిడిపి మహిళలు విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more