తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కోసం రాజీనామా చేస్తామని కొంతమంది ఎంపీలు అంటున్నారు. మరి కొంత మాత్రం ఏ ఇతర రాజకీయ పార్టీల కోసమో, 2014 ఎన్నికల కోసమే మేం రాజీనామాలు చేయం. కానీ తెలంగాణ ప్రజల కోసమే మేం రాజీనామా చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ రాజీనామాల పర్వం పై ఢిల్లీ పెద్దలు నీళ్లు చల్లపనిలే నిగమగ్నమైనట్లు తెలుస్తోంది. కేరళ వైద్యుడు వాయలార్ రవి కొంతమందికి వైద్యం చేసినట్లు సమాచారం. మరికొంత మంది ఎంపీలకు ఆయన వైద్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై చర్చల ప్రక్రియ జరుగుతూనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకులు వాయలార్ రవి పేర్కొన్నారు. ఇదే విషయమై ఎంపీ మధుయాష్కి తనను కలిసి తెలంగాణపై పరిస్థితిని వివరించారని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని వాయలార్ తెలిపారు. వాయలార్ రవి మాట్లాడుతూ యూపీఏ భాగస్వామ్య పక్షం ఎన్‌సీపీ తెలంగాణకు మద్దతు ప్రకటించడాన్ని ఆయన ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జరగాల్సిన ప్రక్రియకు ఎన్సీపీ మద్దతు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ అంశాన్ని తిరస్కరించినట్టు ఏనాడూ కాంగ్రెస్ చెప్పలేదని వాయలార్ రవి వివరణ ఇచ్చారు. అన్ని పార్టీల మద్దతు లభిస్తే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేందుకు పరిస్థితి అనుకూలిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజీనామాల విషయంలో ఎంపీ మధుయాష్కితో మాట్లాడానని, ఎవరూ రాజీనామాలు చేయనవసరం లేదని, మిగిలిన వారితో త్వరలో మాట్లాడతానని రవి అన్నారు. టీఆర్ఎస్‑ను కాంగ్రెస్‑లో విలీనం చేస్తామన్న ప్రకటనను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రతిపాదన చాలా ఉపయోగకరమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తాను, గులాం నబీ ఆజాద్ మూడు ప్రాంతాల నేతలతో చర్చిస్తామన్నారు. తెలంగాణపై నిర్ణయం బడ్జెట్ సమావేశాలకు ముందా, తర్వాత అనేది కేంద్ర హోంమంత్రి షిండే చెప్పాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇతర సీనియర్ నేతలతో తెలంగాణ విషయమై మాట్లాడతారని వాయలార్ చెప్పారు. సంప్రదింపుల తేదీల గురించి కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను అడగాలని ఆయన తెలంగాణ ఎంపీలకు సూచించారు. ఆయనే ఇంఛార్జ్ కాబట్టి ఆయనే చెబుతారన్నారు. కాంగ్రెసు పార్టీ వైఖరిని చాకో స్పష్టం చేశారన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more